Ola S1 X+ Electric Scooter Offer :ప్రస్తుత దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. దాంతో కంపెనీలు కూడా భారీ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా భారత్‌లో అతిపెద్ద విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా(Ola)యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ ఎండ్ ఐస్ ఏజ్ మిషన్‌ను వేగవంతం చేసే కార్యక్రమంలో భాగంగా 'డిసెంబర్ టు రిమెంబర్' పేరుతో ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Ola Electric Scooter : ఈ నెల 3 నుంచి స్టార్ట్ అయిన 'డిసెంబర్ టు రిమెంబర్' క్యాంపెయిన్‌లో భాగంగా ఓలా తన ఎస్1 ఎక్స్ ప్లస్(Ola S1 X Plus) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఏకంగా రూ. 20వేల తగ్గింపును ఇస్తోంది. ఓలా స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ బంపర్ ఆఫర్.. డిసెంబర్ 31లోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే అనే విషయం గమనించాలి. ఇంతకీ ఆఫర్లో ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత ధరకు లభిస్తుంది? దాని ఫీచర్లు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఓలా ఎస్1 ఎక్స్+ ధర ఎంతంటే..
- ఈ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ. 1,09,999. కానీ, ఈ స్కూటర్‌పై ప్రస్తుతం రూ.20 వేల తగ్గింపు ఇవ్వడంతో.. దీని ఎక్స్షోరూ ధర రూ. 89,999కి దిగొచ్చింది.
- దీనితో పాటు ఫైనాన్స్ ఆఫర్స్ సైతం ఉన్నాయి. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 5000 వరకు బెనిఫిట్ పొందొచ్చు.
- సులభమైన EMI విధానంలో చెల్లించే అవకాశం కల్పిస్తోంది కంపెనీ.
- అదే విధంగా జీరో డౌన్ పేమెంట్స్, జీరో ప్రాసెసింగ్ ఫీ 6.99 శాతం వడ్డీకే ఫైనాన్స్ కల్పించే సౌకర్యం అందిస్తోంది.
- అయితే.. ఈ ప్రైజ్ కట్ అనేది డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిమితం అని సంస్థ వెల్లడించింది.