తెలంగాణ

telangana

ETV Bharat / business

సెబీ ఛైర్‌పర్సన్​ను ప్రశ్నించనున్న పార్లమెంటరీ కమిటీ - ఎన్​ఎస్​ఈ కేసు

NSE Scam Case: సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు మంగళవారం హాజరుకానున్నారు. ఇటీవలి ఎన్​ఎస్​ఈ స్కామ్‌పై ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

NSE Scam Case
ఎన్ఎస్​ఈ కేసు

By

Published : Apr 4, 2022, 6:52 AM IST

NSE Scam Case: క్యాపిటల్ మార్కెట్‌కు సంబంధించిన రెగ్యులేటరీ సమస్యలపై సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు మంగళవారం హాజరుకానున్నారు. ఇటీవలి ఎన్​ఎస్​ఈ స్కామ్‌పై ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన నోటీసు ప్రకారం అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలు, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధికి సంబంధించిన రెగ్యులేటరీ సమస్యలపై ఉద్దేశపూర్వకంగా బుచ్‌ను ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి జయంత్ సిన్హా అధ్యక్షతన గల ప్యానెల్ పిలిచింది.

ఎన్​ఎస్​ఈ స్కామ్‌లో మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చిత్రా రామకృష్ణ, రవి నారాయణ్‌లతో సహా పలువురు ఉన్నతాధికారులు విచారణలో ఉన్నారని సెబీ ఛైర్‌పర్సన్‌ను సభ్యులు ప్రశ్నిస్తారని కమిటీలోని వర్గాలు తెలిపాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బిహార్ మాజీ ఆర్థిక మంత్రి సుశీల్ మోదీ, పలువురు న్యాయవాదులు, రాజకీయ నాయకులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. ఇటీవల ఎన్‌ఎస్‌ఈలో జరిగిన కుంభకోణంపై సెబీ ఛైర్‌పర్సన్‌ను ప్రశ్నించనుందని వర్గాలు తెలిపాయి. గత వారంలో పార్లమెంటరీ ప్యానెల్‌తో సెబీ అధికారులు సమావేశం కావడం ఇది రెండోసారి. వారు మార్చి 30న కూడా ప్యానెల్ ముందు హాజరయ్యారు.

ఇదీ చదవండి:'సీబీఐ ఇప్పుడు పంజరంలో చిలుక కాదు'

ABOUT THE AUTHOR

...view details