NPS Withdrawal Rules Changed : ప్రధానంగా.. వేతన జీవులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసాను అందించడం కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన స్కీమ్.. జాతీయ పింఛను పథకం(NPS). ఇది సాధారణ పౌరులకు కూడా అందుబాటులో ఉంది. సురక్షిత ఉద్యోగ విరమణ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌లలో NPS ఒకటి. దీనికి కేంద్ర ప్రభుత్వ భరోసా ఉండడంతో ఎక్కువ మంది దీనిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఎన్‌పీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) తాజాగా కొన్ని నిబంధనలను సడలించింది. కొత్తగా ఖాతా ప్రారంభించాలనుకునే వారికి ఇది ఓ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏంటి? దాని వల్ల ఎన్‌పీఎస్ పింఛన్‌దారులు పొందే ప్రయోజనం ఏమిటి? అనే వివరాలను ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Some Changes in National Pension Scheme : నేషనల్ పెన్షన్ స్కీమ్(National Pension Scheme) సబ్ స్క్రైబర్స్ కోసం పీఎఫ్ఆర్డీఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సిస్టమేటిక్ లంప్సమ్ విత్ డ్రాల్స్(SLW) అనే పేరుతో ఈ కొత్తరూల్ వచ్చింది. నూతనంగా తీసుకొచ్చిన SLW సదుపాయం ద్వారా ఎన్‌పీఎస్ ఖాతాదారుడు తాను పెట్టిన పెట్టుబడి నుంచి తన అవసరాలకు అనుగుణంగా నగదును ఇన్ స్టాల్ మెంట్స్ మార్గంలో ఉపసంహరించుకోవచ్చు. అంటే.. ఎన్‌పీఎస్ ఖాతాదారులు ఈ సిస్టమాటిక్ లప్సమ్ విత్ డ్రాల్ ఫెసిలిటీ ద్వారా వారి ఇష్టానుసారంగా నగదు విత్ డ్రాల్స్ చేసుకోవచ్చన్నమాట.
ఇప్పటి వరకూ ఎన్‌పీఎస్ రూల్ ఇలా..ఎన్‌పీఎస్ పథకంలో చేరిన వారు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం పొందాల్సి ఉంటుంది. అంటే వారు పెన్షన్ ప్లాన్ కొనాల్సి ఉంటుంది. తర్వాత ఒకేసారి మిగిలిన మొత్తాన్ని పొందవచ్చు. ఈ పెన్షన్ ప్లాన్‌ను మెచ్యూరిటీ అమౌంట్‌లో కనీసం 40 శాతాన్ని పెట్టి దీనిని కొనాలి. అందులో ఇక మిగిలిన 60 శాతం మొత్తాన్ని ఖాతాదారులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారికి ఇప్పటివరకు రూల్స్ ఈ విధంగా వర్తిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.