How to Generate 100K per Month from NPS :ఉద్యోగ విరమణ తరువాత జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే.. ఆర్థిక ఒత్తిడి ఉండకూడదు.ఉద్యోగంలోచేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేవరకు ప్రతివ్యక్తీ కాలంతో పరుగులు తీస్తారు. చూస్తుండగానే.. ఉద్యోగ విరమణ సమయం వచ్చేస్తుంది. వయసు ఉడిగి పోతుంది. ఉన్నట్టుండి సంపాదన ఆగిపోతుంది. రిటైర్మెంట్ తరవాత ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా భరోసా ఇచ్చేది పెన్షనే. కాబట్టి.. ముందు నుంచే పొదుపు చేయడం అనివార్యం. అయితే.. రిటైర్ అయిన తరవాత మీకు నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్ వస్తే ఎలా ఉంటుంది? అలాంటి పథకాన్నే.. జాతీయ పింఛను పథకం (NPS) ప్రవేశపెట్టింది. మరి.. ఉద్యోగ విరమణ తర్వాత నెలనెలా లక్ష రూపాయలను అందించే ఈ స్కీమ్‌లో ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి? ఎంతెంత పెట్టాలి? ఎవరు అర్హులు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
National Pension System Details in Telugu : కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS). దీన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు. జాతీయ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సురక్షితం. ఎందుకంటే దీనికి ప్రభుత్వ మద్దతు ఉంటుంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినవారికి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీల కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఉద్యోగ విరమణ తరవాత.. నెలకు లక్ష రూపాయల పింఛను పొందవచ్చు.
NPS Scheme Benefits : రోజుకు రూ.100 ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.57 వేలు పెన్షన్!