తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫుల్​ జోష్​లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ @ 63,284 - సెన్సెక్స్​ 63500

వరుసగా ఎనిమిదో రోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ వరుసగా ఆరో రోజూ జీవనకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి.

indian stock market today
indian stock market today

By

Published : Dec 1, 2022, 4:05 PM IST

Updated : Dec 1, 2022, 4:29 PM IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం కూడా సరికొత్త గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి 63,284 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 54 పాయింట్లు వృద్ధి చెంది 18,813 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 63,358 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 63,583 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 185 పాయింట్ల లాభంతో 63,284 వద్ద స్థిరపడింది. 18,872 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 18,888 వద్ద సరికొత్త గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 54 పాయింట్ల లాభంతో 18,812 వద్ద ముగిసింది. బుదవారం వరకు నిరాశ పరిచిన ఐటీ రంగం కూడా ఈ రోజు ఊపందుకుంది. దీనికి తోడు అమెరికాలో వడ్డీరేట్ల పెంపు విషయంలో వేగాన్ని తగ్గిస్తామన్న ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సంకేతాలు కూడా సూచీల పరుగుకు దోహదం చేశాయి.

  • సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టీసీఎస్​, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో షేర్లు లాభాల్లో ముగిశాయి.
  • హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా , ఎన్​టీపీసీ షేర్లు వెనుకబడి ఉన్నాయి.
  • భారత్​తో పాటుగా ఆసియాలోని సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ దేశాల మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీల పరుగుకు దోహదం చేశాయి.
  • మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ చమురు పీపా ధర ఇంకా 85.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు లాభపడి 81.22 వద్ద కొనసాగుతుంది.
  • విదేశీ పెట్టుబడు దారులు బుధవారం రూ.9,010.41 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Last Updated : Dec 1, 2022, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details