New TCS Rules 2023 : క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు, విదేశాల్లో పెట్టుబడి పెట్టినవారికి బ్యాడ్ న్యూస్. మరో రెండు వారాల్లోట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) రేట్లు భారీగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులు, విదేశీ ప్రయాణం చేసేవారు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టేవారు ఇప్పుడున్న దాని కంటే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెట్టేవారికి కూడా పెరిగిన ఛార్జీలు మరింత భారం కానున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 అక్టోబర్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నట్లు తెలిపింది.
New TCS Rules 2023 : క్రెడిట్ కార్డులకు, విదేశీ పెట్టుబడులకు కొత్త రూల్స్.. ఆ లిమిట్ దాటితే 20% టాక్స్! - విదేశీ పెట్టుబడులపై టీసీఎస్ ఛార్జీలు
New TCS Rules 2023 : కేంద్ర ప్రభుత్వం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్) రేట్లను భారీగా పెంచింది. ఈ పెరిగిన పన్నులు 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా విదేశీ విద్య, విదేశీ పెట్టుబడులు, విమానం టికెట్ ఛార్జీలు, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఛార్జీలు అన్నీ భారీగా పెరగనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.
కొత్త టీసీఎస్ నిబంధనలు 2023
Published : Sep 16, 2023, 4:55 PM IST
పెరిగిన టీసీఎస్ ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..
- విదేశీ విద్యాఖర్చులపై టీసీఎస్
TCS on Education Fees :2023 అక్టోబర్ 1 నుంచి విదేశాల్లో విద్యకు సంబంధించిన ఖర్చులు రూ.7 లక్షల లోపైతే ఎటువంటి టీసీఎస్ ఛార్దీలు చెల్లించవలసిన అవసరం లేదు. ఒకవేళ ఈ ఖర్చులు రూ.7 లక్షలు దాటితే మాత్రం 5 శాతం టీసీఎస్ చెల్లించవలసి ఉంటుంది. భారత్‌లో ఉన్న తల్లిదండ్రులు, విదేశాల్లో ఉన్న తమ పిల్లల చదువుల కోసం డబ్బులు పంపాలనుకుంటే.. అందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందించవలసి ఉంటుంది. ఉదా: కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు తదితర రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. - వైద్యానికి సంబంధించిన ఖర్చులపై టీసీఎస్
విదేశాల్లో వైద్యానికి అయ్యే ఖర్చులపై చెల్లించే టీసీఎస్ రేట్లు కూడా 2023 అక్టోబర్ 1 నుంచి మారనున్నాయి. ఈ ఖర్చు మొత్తం రూ.7లక్షల లోపైతే టీసీఎస్ నుంచి మినహాయింపు పొందొచ్చు. రూ.7 లక్షలు దాటినట్లయితే కచ్చితంగా 5శాతం టీసీఎస్ చెల్లించాలి. - విదేశీ పెట్టుబడులపై టీసీఎస్ ఛార్జీలు ఇలా ఉన్నాయి..
TCS on Foreign Investment :ప్రస్తుతానికి విదేశీ పెట్టుబడులపై అయ్యే ఖర్చులు.. రూ.7లక్షలు లోపైతే టీసీఎస్ చెల్లించవలసిన అవసరం ఉండదు. ఈ ఖర్చులు రూ.7లక్షలు దాటితే మాత్రం 5 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ 2023 అక్టోబర్ 1 నుంచి మాత్రం ఈ లెక్కలు మారనున్నాయి. విదేశీ పెట్టుబడులపై అయ్యే ఖర్చులు.. రూ.7లక్షలు లోపైతే టీసీఎస్ రుసుములు ఉండవు. అదే రూ.7లక్షలు దాటితే మాత్రం 20 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే విదేశీ పెట్టుబడులపై భారీగా టీసీఎస్ భారం పడుతుంది. - విదేశీ ప్రయాణంపై టీసీఎస్
TCS on Foreign Travel :2023 అక్టోబర్ 1 నుంచి విదేశీ ప్రయాణ ఖర్చులపై కూడా టీసీఎస్ భారం పడనుంది. ప్రస్తుతం విదేశీ ప్రయాణ ఖర్చులపై ఎంతైనప్పటికీ 5 శాతం టీసీఎస్ మాత్రమే కట్టాల్సి ఉంది. అయితే అక్టోబర్ 1 నుంచి.. విదేశీ ప్రయాణ ఖర్చులు రూ.7లక్షలు లోపైతే 5 శాతం టీసీఎస్ చెల్లించాలి. రూ.7లక్షలు దాటితే మాత్రం 20 శాతం చెల్లించాలి. - క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఫారెక్స్ కార్డ్‌లపై టీసీఎస్..
TCS on Credit Card and Debit Card : 2023 అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఫారెక్స్ కార్డ్‌ల ద్వారా విదేశాల్లో జరిపే చెల్లింపుల మొత్తం రూ.7లక్షలు లోపు ఉంటే.. ఎటువంటి టీసీఎస్ ఛార్జీలు ఉండవు. రూ.7లక్షలు దాటితే మాత్రం 20 శాతం టీసీఎస్ రుసుములు చెల్లించాలి.