New SIM Card Rules From 1st December 2023 : నేడు మొబైల్ ఫోన్ లేనిదే జీవించలేని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది కనీసం ఒకటి లేదా అంతకు మించి సిమ్ కార్డులను వాడుతూ ఉంటారు. అందుకే మొబైల్ ఫోన్ యూజర్లు అందరూ 2023 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త సిమ్ కార్డ్ రూల్స్ గురించి తెలుసుకోవాలి.
కొత్త నిబంధనలు పాటించాల్సిందే!
కేంద్ర ప్రభుత్వం మొదట్లో ఈ అక్టోబర్ 1 నుంచే ఈ కొత్త సిమ్ కార్డ్ నిబంధనలను అమలు చేయాలనుకుంది. కానీ తరువాత డిసెంబర్ 1 వరకు ఆ గడువును పొడిగించింది. మీరు కనుక కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చేయాలనుకున్నా, లేదా సిమ్ కార్డ్ విక్రేతలుగా ఉండాలన్నా.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న సిమ్ కార్డ్ రూల్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
స్కామ్స్ నివారించేందుకే..
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫేక్ సిమ్‌లతో జరిపే.. ఆన్లైన్ స్కామ్‌లు, ఫ్రాడ్లు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని నివారించేందుకే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ సరికొత్త సిమ్ కార్డ్ రూల్స్‌ను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అందువల్ల ఇకపై కొత్త సిమ్ కార్డ్ కొనాలన్నా, లేదా సిమ్ కార్డ్ విక్రేతలుగా ఉండాలన్నా.. నూతన నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే!
ఒక వేళ ఎవరైనా ఈ సిమ్ కార్డ్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. వారికి ఫైన్, పెనాల్టీ సహా జైలు శిక్ష కూడా విధిస్తారు. కనుక, మనం డిసెంబర్ 1 నుంచి అమలుకానున్న నయా సిమ్ కార్డ్ రూల్స్ గురించి తెలుసుకుందాం.
New Sim Card Rules 2023
1. సిమ్ డీలర్ వెరిఫికేషన్ : ఎవరైనా సిమ్ కార్డులు విక్రయించాలని అనుకున్నా లేదా సిమ్ కార్డ్ డీలర్లుగా ఉండాలన్నా.. వారు కచ్చితంగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. అలాగే తాము విక్రయించిన సిమ్ కార్డుల వివరాలను కచ్చితంగా నమోదు చేస్తుండాలి. అంతేకాదు పోలీస్ ధ్రువీకరణ బాధ్యత కూడా టెలికాం ఆపరేటర్లే తీసుకోవాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.