New Royal Enfield Himalayan 452 vs Old 411 Key Differences :రాయల్ ఎన్ఫీల్డ్.. కుర్రకారు కలల బైక్. దాని బీటింగ్, సౌండ్ కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. డుగ్గు, డుగ్గు మని అది వెళ్తూ ఉంటే ఈ ఠీవీ వేరే అని ఫీల్ అయ్యే వారు చాలా మందే ఉంటారు. ప్రస్తుతం కంపెనీ కూడా ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త మోడల్ బైక్‌లను ఆవిష్కరిస్తోంది. అత్యాధునిక హంగులు జోడిస్తోంది. నూతన సాంకేతికను అందిస్తోంది. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది గతంలో విడుదల చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 కంటే ఎన్నో అధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి వస్తోంది. కొత్తగా వచ్చిన హిమాలయన్ 452 బైక్‌లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ? ఇంజిన్ సామర్థ్యం ఎంత ? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్ ఫీచర్స్..
Himalayan 452 Features
- ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్ ఐదు కలర్లు, మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది.
- కొత్త హిమాలయన్ 452 మోడల్లో 451.65cc సింగిల్-సిలిండర్, లిక్విఫైడ్ కూలింగ్ ఇంజిన్ ఉంది.
- ఇది రాయల్ ఎన్ఫీల్డ్లోనే బైక్ ఇంజిన్లలో అత్యంత ఆధునికమైన ఇంజిన్.
- బైక్ పూర్తిగా డిజిటల్ టీఎఫ్టీ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్‌తో వస్తోంది.
- డిజిటల్ డిస్ప్లే ఉండటంతో బైక్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చు.
- మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకోవడానిక టైప్ సీ పోర్టు సదుపాయం ఉంది.
- బైక్ ఇంజిన్ 8,000rpm వద్ద 40bhp, 5,500rpm వద్ద 40Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌లను బైక్‌లో అనుసంధానించారు.
- రాయల్ ఎన్ఫీల్డ్ ఈ కొత్త బైక్‌లో ఎల్ఈడీ లైటింగ్‌ను తీసుకొస్తోంది. హజార్డ్ లైట్స్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్, అదనపు సౌకర్యంతో పాటు సేఫ్టీ కోసం దీనిని ఏర్పాటు చేశారు.
- కాగా.. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 2.80లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Hero Karizma XMR Launch : హీరో కరిజ్మా XMR బైక్ లాంఛ్.. ఫీచర్స్ అదుర్స్.. ధర ఎంతంటే?