తెలంగాణ

telangana

New Royal Enfield Bullet 350 Price Features : రాయల్ ఎన్​ఫీల్డ్​ కొత్త సిరీస్.. బుల్లెట్ దూసుకొస్తోంది బ్రో..!

Royal Enfield Bullet 350 Price Features : ద్విచక్ర వాహనాల్లో రారాజుగా కీర్తిపొందుతున్న రాయల్ ఎన్​ఫీల్డ్​ కొత్త సిరీస్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. మరి, దాని ప్రత్యేకతలు ఏంటో చూద్దామా..?

By

Published : Aug 17, 2023, 5:23 PM IST

Published : Aug 17, 2023, 5:23 PM IST

New Royal Enfield Bullet 350 Price Features
New Royal Enfield Bullet 350 Price Features

Royal Enfield Bullet 350 Features : ద్విచక్ర వాహనాల్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నా.. మరెన్ని మోడల్స్ ఉన్నా.. రాయల్ ఎన్​ఫీల్డ్​లో ఉండే రాజసమే వేరు. దాని ప్రత్యేకమైన ఆహార్యం నుంచి అది చేసే శబ్ధం, దూసుకెళ్లే వేగం.. అన్నీ తనకు మాత్రమే సొంతం అనేలా ఉంటాయి. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ బైక్​కు భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు 50కి పైగా దేశాల్లో ఈ బైక్ పరుగులు తీస్తోంది. గతేడాది వరల్డ్ వైడ్​గా 60 వేల బైకులు విక్రయించిన రాయల్ ఎన్​ఫీల్డ్ మోటార్స్.. అతి త్వరలో మరో కొత్త మోడల్​తో మార్కెట్​ లోకి దూసుకొస్తోంది. మరి, ఆ బైక్ ప్రత్యేకతలు ఏంటి? ఖరీదు ఎంత? ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి రాబోతోంది? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

సెప్టెంబర్​లో న్యూ మోడల్..

New Royal Enfield Bullet 350 Model Launch in September 1st :

రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​ను మొదటిసారిగా 1932 నవంబర్​లో.. లండన్‌లోని "ఒలింపియా మోటార్‌ సైకిల్ షో"లో ప్రదర్శించారు. ఆ ప్రదర్శన సమయంలోనే ఈ బైక్ పై యూత్ మనసు పారేసుకుంది. ఈ ద్విచక్ర వాహనంపై యువకులకు అప్పుడు పుట్టిన ప్రేమ.. దశాబ్దాలు మారుతున్నా.. పెరుగుతోందే తప్ప, తగ్గట్లేదు. ఈ బైక్​పై యువతకు ఉన్న క్రేజ్​కు అనుగుణంగా.. తయారీ దారులు కూడా కొత్త కొత్త మోడల్స్​(New Royal Enfield Classic 350 Colors)ను రంగంలోకి దించుతున్నారు. ఈ సెప్టెంబర్ 1వ తేదీన రాయల్ ఎన్​ఫీల్డ్​ న్యూ మోడల్​ను ఆవిష్కరించబోతున్నారు. దాని పేరు రాయల్ ఎన్​పీల్డ్ 350.

Upcoming Bikes : 2023లో లాంఛ్​ కానున్న సూపర్​ బైక్స్​ ఇవే.. ఫీచర్స్​ ఎలా ఉన్నాయంటే?

రాయల్ ఎన్​ఫీల్డ్ 350 ప్రత్యేకతలు..

  • ఈ న్యూ మోడల్ డిజైన్.. చూడ్డానికి క్లాసిక్ 350 (New Royal Enfield Classic 350) తీరుగానే ఉంటుంది.
  • కొన్ని చిన్న చిన్న మార్పులు అదనంగా ఉండే ఛాన్స్ ఉంది.
  • ఈ బుల్లెట్ 350లో "సింగిల్-పీస్ సీటు" ఉంటుంది. హుడ్ లేకుండా రౌండ్ హాలోజన్ హెడ్‌ల్యాంప్ ఉండే అవకాశం ఉంది.
  • రీడిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్, రెక్టాంగిల్ బ్యాటరీ బాక్స్‌ ఉంటుందని టాక్.

బుల్లెట్ 350 ఇంజిన్ ఎలా ఉంటుంది?

New Royal Enfield Bullet 350 Engine :

  • రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్-350 బైక్.. J-సిరీస్ 349 cc, ఎయిర్-ఆయిల్ కూల్ ఇంజన్‌తో రాబోతోందని సమాచారం.
  • ఈ ఇంజిన్.. హంటర్-350, ఇంకా.. క్లాసిక్ 350 తీరుగా ఉండే ఛాన్స్ ఉంది.
  • సుమారు 20 HP పవర్, 27 NM టార్క్‌ను రిలీజ్ చేస్తుందని అంచనా.
  • ఈ బైక్​లో 5 గేర్లు ఉండే ఛాన్స్ ఉందని ఎక్స్​పర్ట్స్​ అంచనా.
  • 41 mm ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, సిక్స్ స్టెప్స్ అడ్జస్టబుల్​ రియర్-షాక్ అబ్జర్బర్స్ ఉంటాయని తెలుస్తోంది.
  • రాయల్ ఎన్​పీల్డ్​ బుల్లెట్-350కి సంబంధించి ఎలాంటి ఫీచర్స్ నూ కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

రాయల్ ఎన్​ఫీల్డ్​ 'కింగ్​'.. మూతపడాల్సిన బుల్లెట్​కు జీవం.. ఆస్తి ఎంతో తెలుసా?

బుల్లెట్ 350 ధర..

New Royal Enfield Bullet 350 Price

రాయల్ ఎన్​ఫీల్డ్ చూడ్డానికి ఎంత రాజసంగా ఉంటుందో.. ధర కూడా అంతే ఉంటుంది. బైక్ ధర ప్రాంతాన్ని బట్టి కొంత మారుతూ ఉంటుంది. ఎక్స్​పర్ట్స్​ అంచనాల ప్రకారం.. ఈ కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్-350 ధర 1.75 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. 2023 సెప్టెంబర్ 1నుంచే జనాలు కొనుగోలు చేయవచ్చు.

Royal Enfield: రాయల్​ ఎన్​ఫీల్డ్​ గురించి మీకు ఈ విశేషాలు తెలుసా?

'రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి 28 కొత్త మోడల్స్​'

ABOUT THE AUTHOR

...view details