తెలంగాణ

telangana

ETV Bharat / business

Upcoming EV Scooters : అప్​కమింగ్​ ఎలక్ట్రిక్ బైక్స్​ ఇవే.. ఓ లుక్కేయండి! - హోండా ఎలక్ట్రిక్ బైక్​

New Launch Electric Scooters : భారత మార్కెట్​లోకి పలు కంపెనీలు త్వరలోనే లేటెస్ట్​ ఎలక్ట్రిక్ బైక్​లను విడుదల చేయనున్నాయి. ఆ బైక్​లు, వాటి ఫీచర్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

New Launch Electric Scooters
మార్కెట్​లోకి రానున్న ఎలక్ట్రిక్ బైక్​లు

By

Published : Jul 2, 2023, 4:57 PM IST

New Launch Electric Scooters : ప్రముఖ వాహన కంపెనీలతో పాటు స్టార్టప్​ సంస్థలు త్వరలోనే ​సరికొత్త ఈవీ బైక్​లను మార్కెట్​లో ​లాంఛ్ చేయబోతున్నాయి. వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని దిగ్గజ కంపెనీలు.. లేటెస్ట్​ ఫీచర్స్​తో ఈవీలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. వీటికి సంబంధించి ఫొటోలను ఆయా కంపెనీలు ఇప్పటికే విడుదల చేశాయి. మరి త్వరలోనే ఈవీ ప్రియులను పలకరించనున్న కొత్త మోడల్​ బైక్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా!

1. హీరో విదా ఎలక్ట్రిక్ స్కూటర్..
Hero Electric Vida V1 : హీరో మోటార్ కార్ప్కంపెనీ ఇప్పటికే ఈవీ రంగంలో కొత్త ఒరవడి సృష్టించింది. వివిధ రకాల మోడల్స్​ను పరిచయం చేయడానికి హీరో ఈవీ ప్లాట్​ఫామ్​ను ఉపయోగించుకుంటోంది. ఇప్పుడు సరికొత్త 'విదా' మోడల్​ను 2024లో మార్కెట్​లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న V1 మోడల్​కి ఈ విదా స్కూటర్ కొత్త వేరియంట్. బ్యాటరీ కెపాసిటీ, ధర, ఫీచర్స్​ల ఆధారంగా వినియోగదారులు ఎంపిక చేసుకునే విధంగా.. కంపెనీ ఈ స్కూటర్​ను రూపొందిస్తోంది.

2. బజాజ్​ చేతక్​..
Bajaj Chetak : ఈవీ రంగంలో బజాజ్​ ఇప్పటి వరకు ఒకే స్కూటర్​ను విడుదల చేసింది. కొన్ని నెలల కింద ఈ చేతక్​కు మరిన్ని హంగులు జోడించి.. చేతక్ ప్రీమియం పేరుతో లాంఛ్ చేసింది. కాగా బజాజ్​ ఈవీ రంగంలో మరిన్ని సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోవాలని భావిస్తూ.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న చేతక్​కు భిన్నంగా బ్యాటరీ, డిజైన్​, ఫీచర్స్​తో మార్కెట్​లోకి నయా ఈవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

3. ఓలా ఎలక్ట్రిక్..
Ola S1 Air : 2023 జులైలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ను లాంఛ్ చేసేందుకు ఓలా సన్నాహాలు చేస్తోంది. ఎస్​1 ఎయిర్​ అనే పేరుతో మార్కెట్​లోకి లాంఛ్ చేయనుంది. ఇప్పుడున్న ఉన్న S1, S1 ప్రో మోడల్ స్కూటర్​లు ఐదు రంగుల్లో పది వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. కాగా వీటికి అదనంగా మరో రెండు కొత్త రంగుల్లో ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 4.5kW బ్యాటరీ సామర్థ్యంతో ఈ స్కూటర్​ను రూపొందించారు.

4. సింపుల్ ఎనర్జీ..
Simple Energy One : బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సింపుల్ వన్'.. దేశంలో మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. నూతన ఫీచర్స్​తో ఈ స్కూటర్లు విడుదల కానున్నాయి. కాగా ఈ సింపుల్ వన్ స్కూటర్ ధరను రూ.1.45 లక్షలు (ఎక్స్ షోరూం) గా నిర్ణయించారు. ఒక్కసారి ఫుల్ బ్యాటరీ ఛార్జ్​తో ఈ స్కూటర్ 212 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.

5. హోండా యాక్టివా ఈ వెహికిల్..
Honda EV : 2024 ఆర్థిక సంవత్సరంలో హోండా నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ రెండు ఈవీలను పూర్తిగా భారత్​లోనే తయారుచేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఒకటి 'యాక్టివా ఎలక్ట్రిక్' పేరుతో విడుదల కానుంది. కాగా రెండో స్కూటర్​ను బ్యాటరీ మార్చుకోగలిగే విధంగా రూపొందిస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details