New Financial Rules From 1st November 2023 :కొత్తగా మారిన జీఎస్టీ నిబంధనలు సహా ల్యాప్‌టాప్ దిగుమతులపై ఆంక్షలు, ఈక్విటీ డెరివేటివ్స్ లావాదేవీలపై విధిస్తున్న ఛార్జీల పెంపు, EPOలో మార్పులు లాంటి ఫైనాన్షియల్ రూల్స్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
GSTలో మార్పులు..
Big Change in GST For Businesses :సెప్టెంబర్‌లో జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం ప్రకారం.. రూ.100 కోట్లు, ఆపై టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ GST ఇన్వాయిస్లను 30 రోజుల్లోగా ఈ-ఇన్‌వాయిస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ల్యాప్‌టాప్ దిగుమతులకు డెడ్‌లైన్..
Deadline For Laptop Import Restriction Ends : కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితంHSN 8741 కేటగిరికి చెందిన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై పలు ఆంక్షలు విధించింది. అయితే కొన్ని కారణాలతో ఈ ఆంక్షల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ గడువు తేదీని పెంచాలా? లేదా? అనే దానిపై ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్లు సమాచారం.
BSE ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు పెంపు..
BSE To Increase Transaction Fee On Equity Derivative : ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్‌కు సంబంధించిన లావాదేవీలపై విధిస్తున్న ట్రాన్సాక్షన్స్ ఛార్జీలను పెంచనున్నట్లు తెలిపింది బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE). ఈ నిర్ణయం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని గతనెల ప్రకటించింది.