New Credit Card Rules : దేశంలోని పలు బ్యాంకులు ఈ 2024 సంవత్సర ప్రారంభంలోనే తమక్రెడిట్ కార్డు నియమనిబంధనల్లో అనేక మార్పులు చేశాయి. క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఇచ్చే రివార్డ్ పాయింట్స్, వోచర్స్, కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ సహా పలు బెనిఫిట్స్‌పై పరిమితులు విధించాయి. ముఖ్యంగా ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై ఇచ్చే బెనిఫిట్స్‌ను గణనీయంగా తగ్గించాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
SBI Credit Card Rules :
- ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ ప్రకారం, 2024 జనవరి 1 నుంచి 'పేటీఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డు'లతో చేసే అద్దె చెల్లింపులపై ఎలాంటి క్యాష్‌బ్యాక్స్ అందించరు.
- ఎస్బీఐసింప్లీకిక్, సింప్లీక్లిక్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డులపై ఇచ్చే రివార్డు పాయింట్లపై కూడా పరిమితిలు విధించారు. ఈ క్రెడిట్ కార్డులు ఉపయోగించి ఈజీడిన్నర్ యాప్‌లో ఆర్డర్ చేస్తే, ఇందకు ముందు 10X రివార్డ్ పాయింట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాటిని సగానికి (5X రివార్డ్ పాయింట్లకు) తగ్గించారు.
- అయితే అపోలో 24x7, బుక్ మై షో, క్లియర్‌ట్రిప్, డోమినోస్, మింత్రా, నెట్‌మెడ్స్, యాత్రా యాప్‌ల్లో చేసే ఆన్లైన్ కొనుగోళ్లపై 10X రివార్డ్ పాయింట్లనే కొనసాగిస్తున్నారు.
HDFC Credit Card Rules : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ Regalia, Millenia క్రెడిట్ కార్డ్ బెనిఫెట్స్పై అనేక పరిమితులు విధించింది. వాస్తవానికి ఇవి 2023 డిసెంబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయి.
- HDFC Regalia Credit Card Benefits : హెచ్డీఎఫ్సీ రెగాలియా క్రెడిట్‌పై ఇచ్చే కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ విషయంలో చాలా మార్పులు చేశారు. ఈ కార్డు యూజర్లు మూడు నెలల వ్యవధిలో ఒక లక్ష రూపాయలు లేదా అంత కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే, వారికి 2 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ వోచర్స్ లభిస్తాయి. అది కూడా క్యాలెండర్ క్వార్టర్స్‌లో అంటే జనవరి-మార్చి/ ఏప్రిల్-జూన్/ జులై-సెప్టెంబర్/అక్టోబర్-డిసెంబర్ వ్యవధుల్లోనే ఈ ఎలిజిబిలిటీని సాధించాల్సి ఉంటుంది.
- HDFC Millennia Credit Card Benefits : హెచ్డీఎఫ్సీ మిలీనియా క్రెడిట్ కార్డుతో మీరు చేసే ఖర్చుల ఆధారంగా బెనిఫిట్స్ లభిస్తాయి. క్యాలెండర్ క్వార్టర్స్‌లో అంటే జనవరి-మార్చి/ ఏప్రిల్-జూన్/ జులై-సెప్టెంబర్/అక్టోబర్-డిసెంబర్ వ్యవధుల్లోనే మీరు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే, మీకు ఒక కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఓచర్ లభిస్తుంది.
Axis Bank Credit Card Benefits : యాక్సిస్ బ్యాంక్ ఇటీవలే మాగ్నస్ క్రెడిట్ కార్డు రూల్స్ మార్చింది. ముఖ్యంగా జాయినింగ్ ఫీజు, జాయినింగ్ గిఫ్ట్స్ విషయంలో పలు మార్పులు చేసింది.
ICICI Bank Credit Card Benefits :ఐసీఐసీఐ బ్యాంక్ ఏకంగా 21 క్రెడిట్‌కార్డ్‌ల రూల్స్ మార్చింది. ముఖ్యంగా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్స్ నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.