New Car Launches In November 2023 : దీపావళి పండుగకు కొత్త కారు లేదా బైక్ కొనాలని ఆశపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఈ నవంబర్‌లో తమ లేటెస్ట్ మోడల్ కార్స్, బైక్‌లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అవి ఏమిటంటే..
- న్యూ-జెన్ స్కోడా సూపర్బ్
- న్యూ-జెన్ డస్టర్
- మహీంద్రా బొలెరో నియో ప్లస్
- మెర్సిడెస్ బెంజ్ GLE ఫేస్‌లిఫ్ట్
- మెర్సిడెస్ AMG C43 కార్
- రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్
- ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X బైక్
New Gen Skoda Superb Launch :స్కోడా కంపెనీ ఈ నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా న్యూ-జెన్ స్కోడా సూపర్బ్ కార్‌ను లాంఛ్ చేయనుంది. సాలిడ్ ఎక్స్టీరియర్ డిజైన్‌తో దీనిని రూపొందించారు. ఈ కారు ఇంటీరియర్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఈ కారులో 13 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సహా, పలు సరికొత్త ఫీచర్లు అమర్చినట్లు తెలుస్తోంది. ఇండియాలో దీనిని పరిమితమైన సంఖ్యలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
New Gen Duster Launch Date :రెనాల్ట్ సబ్ బ్రాండ్ డస్టర్ నవంబర్ 29న పోర్చుగల్‌లో New Gen Duster కారును ప్రదర్శించనుంది. ఈ కారును సీఎంఎఫ్-బీ ఆర్కిటెక్చర్‌తో, బగ్స్టర్ తరహా స్టైలిష్ లుక్‌లో తీర్చిదిద్దారు. యూరోప్‌లో దీనిని పెట్రోల్, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ వేరియంట్లలో విడుదల చేయనున్నారని సమాచారం. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని 2025 లేదా 2026లో భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది.
Mahindra Bolero Neo Plus Launch Date :మహీంద్రా బొలెరో నియో ప్లస్ కారు అంబులెన్స్ వెర్షన్ ఇప్పటికే విడుదలైంది. డిసెంబర్ నెలలో సివిలియన్-స్పెక్ ఎస్యూవీ కారు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ కారు 7-సీట్, 9-సీట్ లేఅవుట్‌ల్లో లభ్యం కానుంది. మహీంద్రా బొలెరో నియో ప్లస్ కారులో 2.2లీటర్ mHawk 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు.