తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్​ అకౌంట్లు ఉండొచ్చు? ఎక్కువ ఉంటే ఏమవుతుంది?

Multiple Bank Accounts : వేర్వేరు కారణాల వల్ల ఈ రోజుల్లో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. అయితే ఎక్కువ అకౌంట్లు ఉంటే ఏం జరుగుతుంది..? ఆర్బీఐ ప్రకారం ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉండవచ్చు ? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Multiple Bank Accounts
Multiple Bank Accounts

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 11:12 AM IST

Multiple Bank Accounts : ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగ, వ్యాపార అవసరాల నిమిత్తం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. వ్యాపారం చేసేవారు ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేస్తుంటారు కాబట్టి, కరెంట్ అకౌంట్‌ను, ఉద్యోగం చేసేవారు శాలరీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్‌ చేస్తుంటారు. అయితే, చాలా మందిలో ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే ఏమవుతుంది..? ఆర్‌బీఐ ప్రకారం ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉండవచ్చు ? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. మరి దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్ని అకౌంట్‌లు ఉండాలంటే ? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయిన కలిగి ఉండవచ్చు. బ్యాంకు అకౌంట్‌ల సంఖ్యపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి పరిమితిని ఇప్పటివరకు విధించలేదు. మీకు నచ్చిన ఏ బ్యాంకులో అయిన సేవింగ్‌ ఖాతాలను ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ బ్యాంక్​ అకౌంట్లు ఉండటం జరిగే పరిణామాలు ఏంటో ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

కనీస బ్యాలెన్స్ తప్పనిసరి :శాలరీ అకౌంట్‌ తప్ప మిగతా అన్ని అకౌంట్‌లలో మినిమం బ్యాలెన్స్‌ తప్పనిసరిగా మెయింటనెన్స్ చేయాలి. ఇలా అకౌంట్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్ మెయింటెన్‌ చేయడం అన్ని బ్యాంకులు తప్పనిసరి చేశాయి. అలా చేయడంలో విఫలమయినట్లయితే.. బ్యాంక్ ఆ అకౌంట్ నుంచి కొంత మొత్తం రుసుముగా తీసుకుంటుంది. డిడక్షన్ తర్వాత కూడా మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనట్లయితే.. మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ నెగెటివ్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే కనీస బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలని నిపుణులు అంటున్నారు.

క్లోజ్​ చేయడం మంచిది: ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్‌లు కలిగిన వారు అవసరమైన ఖాతాలు తప్ప మిగిలినవి క్లోజ్‌ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు నిర్వహిస్తున్నపుడు.. మీరు కనీస నిల్వ, బ్యాంక్ నుంచి సందేశ సేవా రుసుములు, డెబిట్ కార్డు రుసుము మొదలైన వాటిని ట్రాక్ చేయాల్సి వస్తుంది. అందుకే అవసరమైన అకౌంట్లను మాత్రమే ఉంచడం మంచిది లేకపోతే రుసుముల రూపంలోనే ఉన్న బ్యాంక్ అకౌంట్లన్నింటిలో నుంచి డబ్బులు కట్ అవుతాయి.

బెస్ట్ క్యాష్​బ్యాక్స్, రివార్డ్ పాయింట్స్ కావాలా? ఈ టాప్​-5 క్రెడిట్ కార్డులపై ఓ లుక్కేయండి!

SBI నుంచి కొత్త క్రెడిట్‌ కార్డ్‌- ప్రతి ట్రాన్సాక్షన్‌ పైనా క్యాష్‌బ్యాక్! ఇంకా ఎన్నో!

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా ? అయితే డబ్బులను నష్టపోతున్నట్లే!

ABOUT THE AUTHOR

...view details