Mukesh Ambani salary per annum : దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వరుసగా రెండో ఏడాది ఎలాంటి వేతనమూ తీసుకోలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంబానీ వేతనం 'సున్నా' అని వార్షిక నివేదికలో పేర్కొంది రిలయన్స్. 2021-22లోనూ ఆయన అదే పంథాను కొనసాగించినట్లు తెలిసింది. ఈ రెండేళ్లు.. రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్గా అంబానీ ఎలాంటి భత్యాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, కమీషన్, స్టాక్ ఆప్షన్స్, ఇతర ప్రయోజనాలేవీ పొందలేదు.
Mukesh Ambani salary in Indian Rupees : ముకేశ్ అంబానీ 2020 జూన్లో తన వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. కరోనా విజృంభణ.. దేశంలో సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రతికూల ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు.. 2019-20లో అంబానీ రూ.15కోట్ల వార్షిక వేతనం పొందారు. ఏటా రూ.24కోట్లు తీసుకునే అవకాశమున్నా.. మేనేజర్ స్థాయి జీతాలు తక్కువగా ఉండాలన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచేందుకు 2008-09 నుంచి ఆయన 11 సంవత్సరాల పాటు రూ.15కోట్ల వార్షిక వేతనం మాత్రమే తీసుకోవడం గమనార్హం.