తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐదో రోజూ అదానీకి షాక్.. సంపన్నుల జాబితాలో టాప్​కు అంబానీ

అదానీ షేర్లు వరుసగా ఐదో రోజు దేశీయ మార్కెట్లో కుప్పకూలాయి. దీంతో సంపదలో గౌతమ్ అదానీని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దాటేశారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. భారత్​లో అత్యంత సంపన్నుడిగా అంబానీ నిలిచారు.

mukesh ambani gautam adani
ముకేశ్ అంబానీ గౌతమ్ అంబానీ

By

Published : Feb 1, 2023, 2:11 PM IST

అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక నేపథ్యంలో వరుసగా ఐదవ రోజు కూడా అదానీ గ్రూప్ షేర్లు పతనమయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం, అదానీ పవర్ (4.98 శాతం), అదానీ గ్రీన్ ఎనర్జీ (3.55 శాతం), అదానీ ట్రాన్స్ మిషన్ (2.98 శాతం), అదానీ విల్మార్ (2.23 శాతం) షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో బుధవారం పడిపోయాయి.

భారత అత్యంత సంపన్నుల జాబితాలో అదానీని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దాటేశారు. అదానీ గ్రూప్ షేర్లు వరుసగా ఐదో రోజు(బుధవారం) కూడా కుప్పకూలడం వల్ల అదానీని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దాటేసినట్లు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా తెలిసింది. ప్రస్తుతం 84.3 బిలియన్ డాలర్ల సంపదతో భారత్​లో అత్యంత సంపన్నుడిగా ముఖేశ్ నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నాల్డ్ అర్నాల్డ్ ఉండగా.. రెండో స్థానంలో టెస్లా అధినేత ఎలాన్​ మస్క్ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details