Mukesh Ambani Children Salary : దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు కూడా ఎలాంటి జీతం తీసుకోకుండా కంపెనీలో పనిచేస్తారని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. అయితే బోర్డ్ మీటింగ్స్, కమిటీ మీటింగ్స్‌లో పాల్గొన్నప్పుడు ఫీజు మాత్రం తీసుకుంటారని స్పష్టం చేసింది.
ముచ్చటగా ముగ్గురు
ముకేశ్ అంబానీకి ఆకాశ్, ఇషా, అనంత్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఆకాశ్, ఇషా ఇద్దరూ కవలలు వారి వయస్సు 31 సంవత్సరాలు. అనంత్ అంబానీ వయస్సు 28 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ బోర్డ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరు బోర్డ్‌లో చేరినప్పుడే.. తాము ఎలాంటి జీతం తీసుకోకుండా పనిచేస్తామని తీర్మానించుకున్నట్లు రిలయన్స్ కంపెనీ తాజాగా తెలిపింది.
జీతం తీసుకోని అంబానీలు
Nita Ambani Children Salaries : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి జీతం లేకుండా కంపెనీలో పనిచేస్తున్నారు. కానీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న అతని సమీప బంధువులు నికిల్, హితల్ మాత్రం జీతంతో పాటు, అలవెన్సులు, కమీషన్లు సహా ఇతర బెనిఫిట్స్ పొందుతున్నారు.
ఆదాయం వస్తుంది ఇలా!
ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు ముగ్గురూ కంపెనీలో జీతం తీసుకోవడం లేదు. అయితే వారికి బోర్డ్ మీటింగ్‌లు, కమిటీ మీటింగ్‌ల్లో పాల్గొన్నందుకు ఫీజు లభిస్తుంది. అలాగే కంపెనీ లాభాల్లో వాటా లభిస్తుంది. ఎందుకంటే వీరి ముగ్గురికి కంపెనీలో భారీ ఎత్తున వాటాలు ఉన్నాయి.
మరో ఐదేళ్లు అయనే!
Reliance Industries CEO : రిలయన్స్ కంపెనీ ఇటీవలే ముకేశ్ అంబానీని మరో 5 ఏళ్లపాటు కంపెనీ ఛైర్మన్, సీఈఓగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించింది. అయితే తాజాగా ఈ నియామకానికి షేర్హాల్డర్ల ఆమోదం కోసం పోస్టల్ బ్యాలెట్లను పంపించింది.
శాశ్వత ఆహ్వానితురాలు
ఇటీవల ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కంపెనీ బోర్డ్ నుంచి తప్పుకున్నారు. కానీ ఆమె కంపెనీ బోర్డ్ మీటింగ్‌లకు ఆమె శాశ్వత ఆహ్వానితురాలిగా ఉంటారు. ఈ ప్రత్యేకమైన వెసులుబాటు ముకేశ్ అంబానీ సహా కంపెనీలోని మరెవ్వరికీ లేకపోవడం విశేషం.
నీతా అంబానీ లాగానే!
Nita Ambani Salary : ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ 2014లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ బోర్డ్‌లో చేరారు. ఆమె 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిట్టింగ్ ఫీజుగా రూ.6 లక్షలు, కమీషన్‌గా రూ.2 కోట్లు తీసుకున్నారు. ఇదే విధంగా ఆకాశ్, ఇషా, అనంత్‌లకు కూడా సిట్టింగ్ ఫీజు, కమీషన్ లభిస్తాయి.