తెలంగాణ

telangana

ETV Bharat / business

Motor Insurance Tips : వాహన బీమా తీసుకుంటున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి!

Motor insurance precautions : వాహనాల ఇన్సూరెన్స్ చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అవి రద్దు అవుతాయి. పాలసీ తీసుకొనే సమయంలో బీమా సంస్థలు పెట్టే నిబంధనలు తెలుకోకపోవటం వల్ల అవి రిజెక్టు అవుతుంటాయి. ఇన్సూరెన్స్ క్లెయిం చేసినప్పుడు రద్దు అవ్వకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

Motor insurance precautions
Motor insurance precautions

By

Published : Aug 6, 2023, 1:46 PM IST

Motor insurance precautions : వాహనాల ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేసినప్పుడు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవి రిజెక్ట్​ అవుతుంటాయి. కనుక ఇన్సూరెన్స్ తీసుకొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే పాలసీ క్లెయిమ్​ రిజెక్ట్​ కాకుండా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం, ఆలస్యంగా ఇన్సూరెన్స్​ను క్లెయిమ్​ చేయటం , టాఫ్రిక్ రూల్స్​ను పాటించకపోవటం, కార్​ రేసులో పాల్గొనటం లాంటి కారణాలు వల్ల చాలా వరకు పాలసీ క్లెయిమ్​లు రిజెక్ట్​ అవుతుంటాయి. అందుకే ఇన్సూరెన్స్​ పాలసీలు రద్దు కాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Motor Insurance Precautions : వాహనం దొంగతనానికి లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్​ విషయంలో ఆలస్యం చేయకూడదు. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్​స్టేషన్​లో ఎఫ్​ఐఆర్​ను నమోదు చేయాలి. ఆ ఎఫ్ఐఆర్​ కాఫీని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలి. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ సర్వేయర్​ వచ్చి.. మీ కారుకు జరిగిన ప్రమాదాన్ని, డామేజ్​ను, రిపేర్​ కాస్ట్​లను లెక్కించి, ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేస్తారు. అప్పుడు మీకు త్వరగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ అప్రూవ్​ చేసిన వర్క్​షాప్​లోనే మీ వాహనాన్ని రిపేర్​ చేయించుకోవడం మంచిది. అలాగే వాహనాల ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వెంటనే​ రెన్యువల్​ చేసుకోవాలి. కార్​లో సీఎన్​జీ కిట్​ను అమర్చినట్లయితే ఆ విషయాన్ని పాలసీ రెన్యూవల్ సమయంలో ఇన్సూరెన్స్​ కంపెనీకి తెలియజేయాలి. అప్పుడు కంపెనీ దానిని మినహాయించి, ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తారు. వాహనానికి ఎంత వరకూ ప్రీమియం ఉందో తెలుసుకోవాలి. ప్రీమియం కన్నా అదనంగా ఖర్చు అయితే బీమా సంస్థలు చెల్లించవు.

రిజెక్టు అయ్యే సందర్భాలు..
Reasons for insurance claim rejection : వాహనాన్ని వ్యక్తిగత అవసరాల కోసం అని చెప్పి, కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగిస్తే ఇన్సూరెన్స్​ వర్తించదు. పాలసీ జియోగ్రాఫికల్​ పరిధి ఎంత వరకూ ఉంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ పరిధికి మించి వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా కారు ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ రాదు. మద్యం, మాదక ద్రవ్యాలు సేవించి వాహనం నడిపినప్పుడు కూడా పాలసీ చెల్లదు. అందువల్ల పాలసీ క్లెయిమ్​లు రిజెక్ట్​ కాకుండా చూసుకోవాలంటే బీమా పాలసీ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి.

కాంప్రహెన్సీవ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి!
Comprehensive car insurance : వాహనదారులు సమగ్ర వాహన బీమా తీసుకోవడం ఎంతైనా మంచిది. దీని వల్ల తప్పనిసరిగా తీసుకోవాల్సి థర్డ్​పార్టీ ఇన్సూరెన్స్​ + ఓన్​ డ్యామేజ్​ కవర్ రెండూ లభిస్తాయి. వాస్తవానికి థర్డ్​పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. వాహన ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ లభిస్తుంది. అదే సమగ్ర వాహన ఇన్సూరెన్స్​ తీసుకుంటే.. ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, విధ్వంసక చర్యల్లో వాహనానికి ఏదైనా డ్యామేజ్​ జరిగితే కూడా బీమా లభిస్తుంది. అందుకే వాటికోసం వాహనదారులు కాంప్రహెన్సీవ్ ఇన్సూరెన్స్​ను తీసుకోవడం ఉత్తమం.

Vehicle Insurance Renewal : వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఎలా చేసుకోవాలో తెలుసా?

హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకుంటారా?.. ఈ విషయాలు మస్ట్​గా తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details