తెలంగాణ

telangana

ETV Bharat / business

తక్కువ బడ్జెట్లో పెద్ద కారు కొనాలా? టాప్​-6 సెవెన్​ సీటర్​​ కార్స్ ఇవే! - top 5 seven seater cars in india

Most Affordable Seven Seater Cars In India In Telugu : మీ కుటుంబం కోసం పెద్ద కారు కొనాలని అనుకుంటున్నారా? ధర కూడా తక్కువగా ఉండాలా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్​లోని టాప్​-6 సరసమైన (ఎఫర్డబుల్)​​ సెవెన్​ సీటర్​ కార్లపై ఓ లుక్కేద్దాం రండి.

best seven seater cars in India
most affordable seven seater cars in India

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 12:56 PM IST

Most Affordable Seven Seater Cars In India :భారతదేశంలో నేడు కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్లో కుటుంబం మొత్తం ప్రయాణించడానికి అనువైన కార్లను కొనేందుకు వినియోగదారులు ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు.. బడ్జెట్లో మంచి సేఫ్టీ ఫీచర్లతో.. 7-సీటర్​ కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలోని టాప్​-6 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Renault Triber Features : రెనో​ ట్రైబర్​ అనేది మంచి పాకెట్ ఫ్రెండీ MPV కారు అని చెప్పుకోవచ్చు.

  • ఈ కారులో 1.0లీటర్​ పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఇది​ 71 bhp పవర్​, 96 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
  • ఈ రెనో ట్రైబర్​ కారు.. గ్లోబల్​ NCAP క్రాస్​ టెస్ట్​లో 4-స్టార్ రేటింగ్​ను సాధించింది.
  • ఈ రెనో​ ట్రైబర్ కారులో 8 అంగుళాల ఇన్ఫోటెన్మెంట్​ సిస్టమ్​, కూల్డ్ గ్లోవ్​ బాక్స్​, సెంటర్ కన్సోల్ లాంటి మంచి ఫీచర్లు ఉన్నాయి.
    రెనో ట్రైబర్​
    రెనో ట్రైబర్​

Renault Triber Price :

  • రెనో​ ట్రైబర్​ (మాన్యువల్) ధర రూ.6.34 లక్షలు - రూ.8.46 లక్షలు వరకు ఉంటుంది.
  • రెనో​ ట్రైబర్​ (AMT) ధర రూ.8.13 లక్షలు - రూ.8.98 లక్షలు వరకు ఉంటుంది.
    రెనో ట్రైబర్​
    రెనో ట్రైబర్​

Maruti Suzuki Eritga and Toyota Rumion Features :మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా రూమియన్ రెండూ క్లోన్స్​. అంటే రెండు కార్లు కూడా.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, డిజైన్​తో సహా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. వీటిలో 1.5 లీటర్​ పెట్రోల్ పవర్​ట్రైన్​ను ఏర్పాటు చేశారు. ఇది 102 bhp పవర్​, 136.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా

ఈ మారుతి సుజికి ఎర్టిగా, టయోటా రూమియన్ కార్లలో 7- అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​​ విత్ వైర్​లెస్​ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే ఉన్నాయి. అలాగే వీటిలో డ్యూయెల్ ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​ విత్ ఈబీడీ ఉన్నాయి. అలాగే ఈ కార్లలోని సెకెండ్ రోలో చైల్డ్ సీట్​ కూడా ఉంటుంది.

మారుతి సుజుకి ఎర్టిగా

Maruti Suzuki Eritga Price :

  • మారుతి సుజుకి ఎర్టిగా (మాన్యువల్) ధర రూ.8.64 లక్షలు - రూ.11.58 లక్షలు ఉంటుంది.
  • మారుతి సుజుకి ఎర్టిగా (ఆటోమేటిక్) ధర రూ.11.28 లక్షలు - రూ.13.08 లక్షలు ఉంటుంది.
    మారుతి సుజుకి ఎర్టిగా

Toyota Rumion Price :

  • టయోటా రూమియన్ (మాన్యువల్) ధర రూ.10.29 లక్షలు - రూ.12.18 లక్షలుగా ఉంది.
  • టయోటా రూమియన్ (ఆటోమేటిక్​) ధర రూ.11.89 లక్షలు - రూ.13.68 లక్షలుగా ఉంది.
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్

Mahendra Bolero Neo Features :మహీంద్రా బొలెరో నియో బడ్జెట్లో లభిస్తున్న బెస్ట్​ డీజిల్​ కారు. ఈ ఎస్​యూవీ కారులో 1.5 లీటర్​ డీజిల్ ఇంజిన్​ను అమర్చారు. ఇది 99 bhp, 260 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

మహీంద్రా బొలెరో నియో
మహీంద్రా బొలెరో నియో

Mahendra Bolero Neo Price :

  • మహీంద్రా బొలెరో నియో (N4) కారు ధర రూ.9.64 లక్షలు
  • మహీంద్రా బొలెరో నియో (N8) కారు ధర రూ.10.17 లక్షలు
  • మహీంద్రా బొలెరో నియో (N10) కారు ధర రూ.11.38 లక్షలు
    మహీంద్రా బొలెరో నియో

Kia Carens Features :

  • ఈ కియా కేరెన్స్​ కారు 1.5 లీటర్​ టర్బో ఇంజిన్​, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది.
  • 1.5 లీటర్​ టర్బో పెట్రోల్ ఇంజిన్​ 158 bhp పవర్​, 253 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
  • 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్​ 113 bhp పవర్​, 250 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
    కియా కేరెన్స్​

Kia Carens Safety Features : ఈ కియా MPV కారులో.. 6-ఎయిర్​బ్యాగ్​లు, డౌన్​హిల్​ బ్రేక్​ కంట్రోల్​, ఆల్​-వీల్​ డిస్క్​ బ్రేక్స్​, టైర్ ప్రెజర్​ మానిటర్​, రియర్ పార్కింగ్ సెన్సార్స్​, ఏబీఎస్ లాంటి మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

కియా కేరెన్స్​

Kia Carens Price :

  • కియా కేరెన్స్​ (పెట్రోల్​ NA) కారు ధర రూ.10.45 లక్షలు - రూ.11.75 లక్షలు ఉంటుంది.
  • కియా కేరెన్స్​ (టర్బో) కారు ధర రూ.12 లక్షలు - రూ.18.95 లక్షలు ఉంటుంది.
  • కియా కేరెన్స్​ (డీజిల్​) కారు ధర రూ.12.65 లక్షలు - రూ.19.45 లక్షలు ఉంటుంది.
    కియా కేరెన్స్

Citroen C3 Aircross Features :

  • ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్​క్రాస్​ కారు 5 సీటర్​, 5+2 సీటర్​ ఆప్షన్లలో లభిస్తోంది.
  • ఈ సిట్రోయెన్​ మిడ్​-సైజ్​ ఎస్​యూవీ కారులో 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ను అమర్చారు. ఇది 109 bhp పవర్​, 190 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
  • ఈ సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ కారులో 10 అంగుళాల టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్​ సిస్టమ్ ఉంది. అలాగే మాన్యువల్ ఏసీ, ట్విన్ ఎయిర్​బ్యాగ్స్​, టైర్ ప్రెజర్ మానిటర్ ఉన్నాయి.
    సిట్రోయెన్ సీ3
    సిట్రోయెన్ సీ3 ఎయిర్​క్రాస్

Citroen C3 Aircross Price :సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ (5+2 సీటర్​) కారు ధర రూ.11.69 లక్షలు - రూ.12.14 లక్షలు ఉంటుంది.

సిట్రోయెన్ సీ3 ఎయిర్​క్రాస్

రెనో​ న్యూ-జెన్​ Duster​ కార్​ ఆవిష్కరణ - లుక్స్​, ఫీచర్స్​ అదుర్స్​!

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టాప్​-10 కార్లు ఇవే!

ABOUT THE AUTHOR

...view details