Most Affordable Cars With 6 Airbags : భారతదేశంలో ట్రాఫిక్ సహా, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ బ్రాండెడ్ కార్లలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను పొందుపరుస్తున్నాయి.
భద్రతకే తొలి ప్రాధాన్యం!
హ్యుందాయ్, టాటా కంపెనీలు ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు.. మీడియం బడ్జెట్లో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లను అందిస్తున్నాయి. దీని వల్ల అనుకోకుండా ప్రమాదం జరిగినా.. పెద్దగా గాయాలపాలు కాకుండా ప్రయాణికులు తప్పించుకోవడానికి వీలవుతుంది. అందుకే హ్యుందాయ్, టాటా ఆటోమొబైల్ కంపెనీలు అందిస్తున్న 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న టాప్-9 కార్లపై ఓ లుక్కేద్దాం రండి.
1. Hyundai Grand i10 Nios Features :బడ్జెట్లో మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారు ఇది. ముఖ్యంగా ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT అనుసంధానం కలిగి ఉంటుంది. అలాగే ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్/ సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది.
Hyundai Grand i10 Nios Price : మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు ధర రూ.5.84 లక్షలు - రూ.8.51 లక్షలు వరకు ఉంటుంది.
2. Hyundai Exter Features : హ్యుందాయ్ ఎక్స్టర్ కారు మంచి లుక్‌తో.. పట్టణాల్లో ప్రయాణించడానికి చాలా అనువుగా ఉంటుంది. బడ్జెట్లో మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న మైక్రో-ఎస్యూవీ కారు ఇది. దీనిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT అనుసంధానం కలిగి ఉంటుంది.
Hyundai Exter Price :మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్టర్ కారు ధర రూ.6 లక్షలు - రూ.10.15 లక్షలు ఉంటుంది.
3. Hyundai Aura Features :హ్యుందాయ్ కంపెనీ ఇటీవలే తమ కార్లు అన్నింటిలోనీ కచ్చితంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తామని స్పష్టం చేసింది. అందులో భాగంగా హ్యుందాయ్ Aura సెడాన్‌లోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచింది. అయితే ప్రస్తుతానికి టాప్ ట్రిమ్ కారులోనే ఈ సేఫ్టీ ఫీచర్ అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ Auro కారులో కూడా Hyundai Grand i10 Nios కారులోని ఇంజినే ఉంటుంది. అంటే ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్; 1.2 లీటర్ పెట్రోల్/ సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది.
Hyundai Aura Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ Aura కారు ధర రూ.6.44 లక్షలు - రూ.9 లక్షలు వరకు ఉంటుంది.
4. Hyundai i20 Features :హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పైగా ఇది 5-స్పీడ్ MT, CVT, 6-స్పీడ్ MT, 7-స్పీడ్ DCT లాంటి మల్టిపుల్ గేర్ బాక్స్ ఛాయిస్‌లలో లభిస్తుంది.
Hyundai i20 Price : మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 కారు ధర రూ.6.99 లక్షలు - రూ.11.16 లక్షలు వరకు ఉంటుంది.