తెలంగాణ

telangana

ETV Bharat / business

Savings Account Auto Sweep Facility : సేవింగ్స్​ అకౌంట్​తో రెట్టింపు రాబడి.. 'ఆటో స్వీప్'​ ఉంటే చాలు!

More Returns With Savings Account Auto Sweep Facility : పొదుపు ఖాతాను చాలా మంది కేవలం డబ్బును దాచుకునే ఓ సాధనంగానే చూస్తారు. కానీ, అదే ఖాతా ద్వారా బ్యాంకులు మనకి అందిస్తున్న 'ఆటో స్వీప్ ఫెసిలిటీ'తో కూడా మనం డబ్బును సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

More Returns With Auto Sweep Facility
Returns On Savings Account Auto Sweep Facility

By

Published : Aug 16, 2023, 2:34 PM IST

More Returns With Savings Account Auto Sweep Facility : ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరికీ సేవింగ్స్​ అకౌంట్​ ఉంటుంది. ఈ ఖాతాల్లో మనం జమ చేసే సొమ్ముపై బ్యాంకులు 2.50% నుంచి 5.50% వరకు వడ్డీని చెల్లిస్తుంటాయి. ఈ రకమైన అకౌంట్ల ద్వారా ఖాతాదారులు తమకు కావాల్సినప్పుడల్లా డబ్బులను విత్​డ్రా చేసుకోవచ్చు. అదే ఫిక్స్​డ్​ డిపాజిట్లలలో అయితే ఈ సౌలభ్యం ఉండదు. ఇదిలా ఉంటే సేవింగ్స్​ ఖాతాలపై కేవలం నామమాత్రపు రాబడిని మాత్రమే పొందొచ్చని అనుకుంటారు చాలామంది. కానీ, దేశంలోని కొన్ని బ్యాంకులు అందిస్తున్న 'ఆటో స్వీప్​' సౌకర్యంతో కూడా మనం అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మీ సేవింగ్స్​ అకౌంట్​, ఎఫ్​డీల కాంబినేషన్​నే ఆటో స్వీప్ ఫెసిలిటీ అని అంటారు. అంటే మీ పొదుపు ఖాతాకు ఓ నిర్ణీత క్యాష్​ లిమిట్​ను సెట్ చేస్తారు. అనంతరం దాన్ని ఎఫ్​డీకి లింక్​ చేస్తారు. దీని ప్రకారమే ఒకవేళ మీ సేవింగ్స్​ ఖాతా గనుక నిర్ణయించిన క్యాష్​ లిమిట్​ను​ దాటితే గనుక జమ చేసిన అదనపు మొత్తం నేరుగా సేవింగ్స్​ అకౌంట్​ నుంచి ఫిక్స్​డ్​ డిపాజిట్​లోకి బదిలీ అవుతుంది. దీనినే ఆటో స్వీప్​ ట్రాన్స్​ఫర్​ అంటారు. ఇందులో జమ అయ్యే నగదుకు సేవింగ్స్ ఖాతాకు వచ్చే వడ్డీ కంటే కూడా అధిక వడ్డీ వస్తుంది. ఇలా మీరు కేవలం సేవింగ్స్​ ఖాతా ద్వారానే రెట్టింపు రాబడిని పొందాలంటే ముందుగా మీరు సేవింగ్స్​ అకౌంట్​ తెరిచే సమయంలో లేదా మధ్యలో సంబంధిత పొదుపు ఖాతాల్లో ఒక నిర్దిష్టమైన మొత్తం మాత్రమే ఉండే విధంగా క్యాష్​ లిమిట్​ను సెట్​ చేయమని బ్యాంకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనినే థ్రెషోల్డ్ లిమిట్​ అని అంటారు. ఇలా మీరు ఫిక్స్​ చేసిన ఫిగర్​ను గనుక మీ సేవింగ్స్​ ఖాతా దాటితే అందులోని అదనపు సొమ్ము ఆటోమెటిక్​గా ఎఫ్​డీలోకి చేరిపోతుంది.

Savings Account More Returns :ఉదాహరణకు మీకు ఆటో స్వీప్ సదుపాయంతో ఓ సేవింగ్స్​ అకౌంట్​ ఉందనుకుందాం. దీనికి మీరు రూ.10,000 క్యాష్​ లేదా థ్రెషోల్డ్​ లిమిట్​ను సెట్​ చేశారు. అంటే ఈ ఖాతాలో గరిష్ఠంగా రూ.10,000 మాత్రమే జమ చేయవచ్చు. ఇప్పుడు మీరు రూ.30,000ను మీ పొదుపు ఖాతాలో జమ చేశారు. అయితే మీ థ్రెషోల్డ్ లిమిట్​ గరిష్ఠంగా పది వేలే కాబట్టి మిగతా రూ.20,000 నేరుగా మీ ఎఫ్​డీ ఖాతాకు ట్రాన్స్​ఫర్​ అవుతాయి. దీంతో మీరు రెండు ఖాతాల(పొదుపు, ఎఫ్​డి) నుంచి రిటర్న్స్​ పొందొచ్చు.

విత్​డ్రా చేసుకోవచ్చా..?
Auto Sweep Facility Banks List :ఒకవేళ ఆటో స్వీప్​ ఫెసిలిటీ ద్వారా మీ ఎఫ్​డీకి బదిలీ అయిన డబ్బును మీరు విత్​డ్రా చేసుకోవాలంటే గనుక ఎఫ్​డీని రద్దు చేసుకోవాల్సిన పని లేదు. అదే సాధారణ ఎఫ్​డీలో కాలవ్యవధికి ముందే డబ్బు ఉపసంహరించుకుంటే గనుక దానిని మొత్తానికి రద్దు చేసుకోవాలి. అయితే మీ పొదుపు​ ఖాతాలో మినిమమ్​ బ్యాలెన్స్ గనుక లేకపోతే మీ ఎఫ్​డీ నుంచి అవసరమైన మొత్తాన్ని సేవింగ్స్​ అకౌంట్​కు బదిలీ చేస్తారు. మరోవైపు ఈ ఆటో స్వీప్ సదుపాయం లిక్విడిటీ ప్రయోజనంతో పాటు ఈఎంఐ కాలవ్యవధిని కూడా ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐసిఐసిఐ బ్యాంక్ సహా దేశంలోని ఇతర బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ ఆటో స్వీప్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details