Mobile Data Consumption In India : మారుతున్న కాలం, పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా భారతీయుల్లో మొబైల్ డేటా వినియోగం కూడా భారీగా పెరిగింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇంటర్న్నెట్ను వినియోగిస్తున్నారు. దీంతో గడిచిన ఐదేళ్లలో భారతీయుల్లో డేటా వినియోగం 3.2 రెట్లు పెరిగింది. సగటున ఓ భారతీయుడు నెలకు వినియోగించే డేటా 2018లో 4.5 ఎక్సాబైట్లు ఉండగా.. 2022కు 14.4 ఎక్సాబైట్లకు చేరుకున్నట్లు నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ నివేదికలో వెల్లడించింది. భారత్‌లో 2022లో ఒక వ్యక్తి నెలకి సగటున 19.5 జీబీల మొబైల్ డేటాను వినియోగిస్తున్నట్లు నోకియా సంస్థ పేర్కొంది.
అమ్మ బాబోయ్.. మనం నెలకు అంత మొబైల్ డేటా వాడేస్తున్నామా!! - భారత్‌లో భారీగా పెరిగిన డేటా వినియోగం
దేశంలో మొబైల్ డేటా వినియోగం గడిచిన ఐదేళ్లలో 3.2 రెట్లు పెరిగింది. దేశ వ్యాప్తంగా డేటా వినియోగం ఒక నెలకు 2018లో 4.5 ఎక్సాబైట్లు ఉండగా.. 2022కు 14.4 ఎక్సాబైట్లకు చేరుకుంది. దీంతో పాటుగా ఓ సగటు భారతీయుడు 2022లో నెలకు 19.5 జీబీ మొబైల్ డేటాను వినియోగించినట్లు నోకియా సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది.
2022 అక్టోబర్‌లో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన 5జీ సాంకేతికతో డేటా వినియోగం మరింత పెరిగిందని నోకియా వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4జీ, 5జీ సేవలను వినియోగిస్తున్నవారే అధిక శాతం ఉన్నట్లు తెలిపింది. 2018 నుంచి వినియోగదారుల డేటా వినియోగం భారీగా పెరిగింది. ఎంతలా పెరిగిందంటే.. 2022 నాటికి ప్రతి వినియోగదారుడు నెలకు 19.5 జీబీ వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఆ డేటా 6,600 పాటలకు సమానం అని తెలిపింది.
2024 నాటికి భారత్‌లోని అన్ని మారుమూల ప్రాంతాలకు 5జీ సేవలు అందుబాటులోకి రావొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం టెలికాం సంస్థలు వేగంగా విస్తరిస్తున్నట్లు పేర్కొంది. 2024 నాటికి సగటు భారతీయుడు వినియోగించే మొబైల్ డేటా రెట్టింపు కంటే అధికంగా ఉండనున్నట్లు స్పష్టంచేసింది. 2022లో భారత్‌లో 7కోట్ల 5జీ పరికరాలు దిగుమతి అయినట్లు నివేదికలో పేర్కొంది. 2027 నాటికి భారత్‌లో ప్రైవేట్ వైర్లెస్ నెట్‌వర్క్‌ల్లో పెట్టుబడులు 250 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఓ అంచనా వేసింది. భారత్‌ను ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఈ రంగంలో వృద్ధి చాలా కీలకమని నోకియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా మార్కెట్ హెడ్ సంజయ్ మాలిక్ అన్నారు.