తెలంగాణ

telangana

ETV Bharat / business

'సారీ.. ఆ ఉద్యోగుల్ని తీసేస్తున్నాం!'.. ఫేస్​బుక్​ బాస్​ ప్రకటన - mark zudkenberg employees news

Meta layoffs 2022 : ట్వట్టర్ బాటలోనే మెటా కంపెనీ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మెటా సీఈఓ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

meta CEO mark zuckerberg
మెటా సీఈఓ మార్క్ జుకర్​బర్గ్

By

Published : Nov 9, 2022, 10:42 AM IST

Updated : Nov 9, 2022, 12:06 PM IST

ఫేస్​బుక్​ మాతృసంస్థ మెటాలో ఉద్యోగుల తొలగింపు ఖాయమైంది. ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ మంగళవారం స్వయంగా ఈ విషయం వెల్లడించారు. మెటా సిబ్బందితో సమావేశంలో ఉద్యోగాల కోతపై స్పష్టత ఇచ్చారు మార్క్. "వృద్ధిపై నాకు ఉన్న మితిమీరిన అంచనాలు.. సంస్థలో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగేందుకు కారణమైంది. సంస్థలో జరిగిన పొరపాట్లు అన్నింటికీ నాదే బాధ్యత. రిక్రూటింగ్, బిజినెస్ టీమ్స్​లోని ఉద్యోగులు లేఆఫ్​కు గురయ్యే వారి జాబితాలో ఉంటారు" అని ఆయన స్పష్టం చేశారు.

అయితే సంస్థను వీడే వారికి 4 నెలలు జీతం ఇస్తామని మెటా సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన విషయాలు బుధవారం విడుదల కానున్నట్లు ఓ ప్రముఖ వార్తా పత్రిక పేర్కొంది. సెప్టెంబర్‌ 30వ తేదీ నాటి గణాంకాల ప్రకారం ప్రస్తుతం మెటాలో ప్రపంచ వ్యాప్తంగా 87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో మెటా వాటాదారులను నిరాశపర్చింది. ఆ సమయంలో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ 2023 వరకు ఉద్యోగుల సంఖ్యను పెంచబోమని.. స్వల్పంగా తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి పరిశ్రమలో ఇతర టెక్‌ సంస్థలు అనుసరిస్తున్నట్లే నియామకాలు తగ్గించుకోవడమో.. లేదా ఉద్యోగుల సంఖ్యలో కోత విధించుకోవడమే చేయవచ్చు. గత వారం సిలికాన్‌ వ్యాలీలో పలు సంస్థలు భారీగా లేఆఫ్‌లను ప్రకటించాయి. మరోవైపు అమెజాన్‌ సంస్థ కార్పొరేట్‌ ఆఫీస్‌లో కొత్త నియామకాలను నిలిపివేసినట్లు పేర్కొంది. ట్విట్టర్‌ మరో వైపు దాదాపు 3,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టింది. మరోవైపు ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి చర్యలు ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థల వాణిజ్య ప్రకటనల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మెటా లాభం 52 శాతం కుంగి 4.4 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఇవీ చదవండి:మంచుకొండల్లో అధికారం చేపట్టాలంటే.. కాంగ్రాపై గురి పెట్టాల్సిందే..!

పుట్టినరోజున అడ్వాణీకి శుభాకాంక్షల వెల్లువ.. స్వయంగా ఇంటికి వెళ్లిన మోదీ

Last Updated : Nov 9, 2022, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details