తెలంగాణ

telangana

ETV Bharat / business

మెడిక్లెయిమ్ Vs హెల్త్ ఇన్సూరెన్సు - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​?

Mediclaim Vs Health Insurance Difference : ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా తలెత్తవచ్చు. అలాంటి కష్టసమయంలో మెడిక్లెయిమ్‌ లేదా హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో మనల్ని ఆదుకుంటాయి. ఆర్థికంగా మనకు రక్షణ కల్పిస్తాయి. అయితే ఆరోగ్య బీమాకు, మెడిక్లెయిమ్​కు ఉన్న ప్రధానమైన వ్యత్యాసాలు ఏమిటి? వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Mediclaim Vs Health Insurance Difference
Mediclaim Vs Health Insurance Difference

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 4:27 PM IST

Updated : Jan 8, 2024, 4:39 PM IST

Mediclaim Vs Health Insurance Difference :ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎప్పుడు, ఎలా తలెత్తుతుందో ఎవరికీ తెలియదు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరగవచ్చు. లేదంటే ఉన్నపళంగా ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇలాంటప్పుడు చేతిలో డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్య బీమా, మెడిక్లెయిమ్​లు మనల్ని ఆదుకుంటాయి. కుటుంబం ఆర్థిక కష్టాల్లోకి జారుకోకుండా కాపాడతాయి. అయితే ఆరోగ్య బీమా లేదా మెడిక్లెయిమ్ పాలసీల్లో ఏది మంచిదనే డౌట్‌ చాలా మందికి వస్తుంది. అయితే ఈ రెండింటి నిబంధనలు ఒకేలా ఉన్నా, పాలసీ కవరేజ్, ప్రయోజనాలు, కవరేజీ పరిధి విభిన్నంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఆరోగ్య బీమా, మెడిక్లెయిమ్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అంటే ఏంటి?
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఆస్పత్రి ఖర్చులను పూర్తిగా చెల్లిస్తుంది. వైద్య బిల్లులు, ఆసుపత్రిలో చేరక ముందు, చేరిన తర్వాత అయిన ఖర్చులను కూడా కవర్‌ చేస్తుంది. అంతేకాకుండా డేకేర్, హోమ్​ హెల్త్​కేర్​​, వైద్య ఖర్చులను కూడా భరిస్తుంది. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) లాంటి ప్రత్యామ్నాయ వైద్య చికిత్సలను ఎంచుకుంటే, వాటికి అయిన ఖర్చులను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలు :

  • ఆసుపత్రి ఖర్చులు, మందుల ఖర్చులు లభిస్తాయి.
  • అవయవ దాతల ఖర్చు, మెంటల్ హెల్త్​కేర్​, రోడ్డు అంబులెన్స్ ఖర్చులను కవర్​ చేస్తుంది.
  • రోజువారీ చికిత్సకు అయ్యే బిల్లులను కూడా ఈ పాలసీ ద్వారా పొందవచ్చు.
  • రిజిస్టర్డ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ సలహా మేరకు, ఇంట్లో ఉండి మీరు తీసుకున్న వైద్యానికి కూడా పరిహారం అందిస్తుంది.
  • ఇక అత్యవసర పరిస్థితుల్లో నగదు రహిత చికిత్సను పొందవచ్చు లేదా మీరు ఖర్చు పెట్టిన నగదును రీయింబర్స్‌ చేసుకోవచ్చు.
  • ఆరోగ్య బీమా సంస్థలు, పాలసీ పునరుద్ధరణ సమయంలో కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్‌ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి.
  • యాడ్-ఆన్‌తో ఇన్సూరెన్స్‌ కవరేజీని మరింతగా పెంచుకోవచ్చు.
  • బీమా కంపెనీలు వ్యక్తిగత ఆరోగ్య బీమాతోపాటు, ఫ్యామిలీ ఫ్లోటర్, సీనియర్ సిటిజన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లాంటి అనేక రకాల స్కీములను అందిస్తుంటాయి. అందులో మన ఆరోగ్య అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవచ్చు.
  • ఆరోగ్య బీమా పాలసీలపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా వర్తిస్తుంది.
  • ఒకవేళ మనం తీసుకున్న పాలసీని ఓ సంవత్సరం పాటు క్లెయిమ్‌ చేసుకోకపోతే, మరుసటి ఏడాది పాలసీకి నో-క్లెయిబ్‌ బోనస్‌ కూడా లభిస్తుంది.
  • చాలా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు జీవితకాలంపాటు పునరుద్ధరణ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి.

మెడిక్లెయిమ్ పాలసీ అంటే ఏమిటి?
మెడిక్లెయిమ్ పాలసీ అనేది బీమా చేసినవారి ఆసుపత్రి బిల్లులకు మాత్రమే భరిస్తుంది. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నగదు రహిత చికిత్స కోసం నెట్‌వర్క్ ఆసుపత్రిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే ఆసుపత్రిలో మీరు చికిత్స తీసుకుంటే, రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. మెడిక్లెయిమ్​లో మీకు కేవలం హాస్పిటల్ బిల్లులకు మాత్రమే రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్ అవుతాయి. రోజువారీ చికిత్సలకు, ఇంట్లో తీసుకున్న వైద్యానికి అయ్యే ఖర్చులను మెడిక్లెయిమ్‌ పాలసీ భరించదు.

మెడిక్లెయిమ్ పాలసీ ప్రయోజనాలు

  • మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మీ హాస్పిటల్ బిల్లులను కవర్ చేస్తుంది.
  • హెల్త్ ఇన్సూరెన్స్​తో పోలిస్తే, మెడిక్లెయిమ్ ప్రీమియం తక్కువగా ఉంటుంది.
  • మీ కోసం లేదా మీ మొత్తం కుటుంబం కోసం మెడిక్లెయిమ్​ పాలసీ తీసుకోవచ్చు.
  • నగదు రహిత లేదా రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చు.
  • పాలసీ ప్రీమియంపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్ Vs మెడిక్లెయిమ్​

Add-Ons : మెడిక్లెయిమ్​ పాలసీలకు యాడ్​-ఆన్​లను జత చేసుకోలేము. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు అయితే క్రిటికల్ ఇల్​నెస్​ కవరేజ్, రూమ్ రెంట్ వేవర్​, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, మెటర్నిటీ కవరేజ్​ లాంటి యాడ్​-ఆన్​లను జతచేసుకోవచ్చు.

Sum Insured :మెడిక్లెయిమ్ పాలసీలకు గరిష్ఠంగా రూ.5 లక్షలు లేదా అంతకంటే కాస్త ఎక్కువగా కవరేజ్ ఉంటుంది. అదే ఆరోగ్య బీమా పాలసీలకు అయితే, మీరు కట్టే ప్రీమియంను అనుసరించి, కొన్ని లక్షలు నుంచి కోట్ల రూపాయల వరకు కవరేజ్ లభిస్తుంది.

ప్రయోజనాలు భిన్నంగా ఉన్నప్పటికీ, మీ స్తోమతకు అనుగుణంగా మెడిక్లెయిమ్‌ లేదా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ల్లో ఏదో ఒకటి తీసుకోవడం చాలా మంచిది. అత్యవసర సమయాల్లో ఇవి మనకు ఆర్థిక భరోసాను కల్పిస్తాయి.

బరువు తగ్గడానికి రొట్టె తింటున్నారా?

పీరియడ్స్ వాయిదా కోసం మందులు వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!

Last Updated : Jan 8, 2024, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details