Maruti Suzuki Upcoming Cars : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వచ్చే 2-3 ఏళ్లలో 8 సరికొత్త మోడల్ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తమ వాహనాలతో దేశీయ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి సుజుకి, తన సరికొత్త మోడల్స్‌తో, వాహన రంగంలోని తమ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
Next Gen Maruti Suzuki Swift And Dzire Car Launch Date :మారుతి సుజుకి ఈ 2024లోనే నెక్ట్స్ జెన్ స్విఫ్ట్, డిజైర్ కార్లను లాంఛ్ చేయనుంది. ఈ కార్లలో 1.2 లీటర్ సామర్థ్యం గల 3 సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ విత్ హైబ్రిడ్ సిస్టమ్‌ను అమర్చారు. అదే విధంగా వీటి డిజైన్లోనూ, కారు ఇంటీరియర్‌లోనూ పలుమార్పులు చేసినట్లు సమాచారం.
Maruti Suzuki Upcoming Electric Cars : మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాలపైనా తన దృష్టిని కేంద్రీకరిస్తోంది. అందులో భాగంగా eVX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 60 కిలోవాట్స్. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఏకంగా 550 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అయితే 48 కిలోవాట్స్ సామర్థ్యం ఉన్న మరో బ్యాటరీ ఆప్షన్‌ను కూడా తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ విద్యుత్ కారును పూర్తిగా భారత్‌లోనే తయారు చేస్తోంది మారుతి సుజుకి. తక్కువ బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.
Upcoming Maruti Suzuki SUV Cars :మారుతి సుజుకి మరో రెండు ఎస్యూవీ కార్లను కూడా రూపొందిస్తోంది. వీటిలోY17 అనే 7-సీటర్ SUV కారును 2015లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. Y43 అనే మైక్రో SUV కారును 2026-27 సంవత్సరాల్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మారుతి సుజుకి Y43 అనేది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్లకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే Y17 కారు నేరుగా టాటా సఫారీ, మహీంద్రా 700SUVలకు పోటీగా నిలవనుంది.