తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? - ఇక్కడ రూ. 5.13 లక్షలకే మారుతి స్విఫ్ట్ కారు!

Maruti Suzuki Swift Variants Price List : సాయుధ బలగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గుడ్​న్యూస్. మీరు మంచి కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లయితే ఇప్పుడే మారుతి సుజుకీ స్విఫ్ట్ కార్ల​పై ఓ లుక్కేయండి. ఎందుకంటే సీఎస్​డీలో ఈ కార్లపై బంపరాఫర్ ఉంది. వీటిపై దాదాపు రూ. 1.18 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Car
Car

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 2:50 PM IST

Maruti Suzuki Swift CSD Price List :దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల బ్రాండ్లలో మారుతి స్విఫ్ట్​ ఒకటి. ఈ మోడల్ మార్కెట్లోకి విడుదలై చాలా సంవత్సరాలు అవుతున్నా ఇంకా సేల్స్​లో టాప్​ గేర్​లో కొనసాగుతోంది. అయితే మీరు సాయుధ బలగాల్లో పనిచేస్తూ.. మంచి డిమాండ్ ఉన్న మారుతి సుజుకీ స్విఫ్ట్ కారు కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. దేశ భద్రతా బలగాల్లో పనిచేస్తున్న సిబ్బంది కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంటీన్​ స్టోర్ డిపార్ట్​మెంట్​(CSD)లో ఈ మారుతి సుజుకీ స్విఫ్ట్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్లలో చాలా తక్కువ ధరకు మీరు స్విఫ్ట్ కార్లను కొనుగోలు చేయవచ్చు. క్యాంటీన్ స్టోర్​లో మారుతి స్విఫ్ట్ పలు వేరియంట్​ కార్ల మీద రూ. 86,000 నుంచి రూ. 1.18 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఏ వేరియంట్ మీద ఎంత తగ్గింపు లభిస్తోంది? ప్రస్తుతం వాటి ధర ఎంత? ఈ కార్లలో ఉన్న ఫీచర్లేంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

CSD Price List of Maruti Swift 2023 :మారుతి సుజుకీ స్విఫ్ట్​ అత్యంత సరసమైన 1.2 లీటర్ LXI మాన్యువల్ బేస్ వేరియంట్ ధర సాధారణ కస్టమర్లకు షోరూమ్​లో రూ.5,99,450గా ఉంది. అదే క్యాంటీన్ స్టోర్ డిపార్ట్​మెంట్​లో రూ.5,13,367 ధరకు అందుబాటులో ఉంది. అంటే CSDలో ఈ కారు కొనుగోలు చేయడం ద్వారా రూ.86,083 ఆదా చేసుకోవచ్చు.

  • అదేవిధంగా.. మారుతి స్విఫ్ట్(Maruti Suzuki Swift) 1.2 లీటర్ VXI ఆటోమేటిక్‌ కారు సాధారణ కస్టమర్లకు ఎక్స్ షోరూమ్ వద్ద రూ.7,50,000కు లభిస్తుంది. అదే కారు సీఎస్​డీలో రూ.6,47,092కి కొనుగోలు చేయవచ్చు. అంటే మీరు క్యాంటీన్ స్టోర్​లో కొనుగోలు చేయడం ద్వారా రూ.97,177 సేవ్ చేసుకోవచ్చు.
  • ఇక మారుతి సుజుకీ స్విఫ్ట్​లో అందుబాటులో ఉన్న CNG కార్ల గురించి మాట్లాడితే.. అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది Maruti Swift VXI CNG కారు. ఇది ఎక్స్ షోరూమ్ వద్ద సాధారణ కస్టమర్లకు రూ.7,85,000కు అందుబాటులో ఉంది. అదే CSDలో మాత్రం రూ. 6,80,755 ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే సైనికులు సీఎస్​డీ నుంచి కొనడం ద్వారా దీనిపై రూ.1,04,245 తగ్గింపు పొందుతారు.
  • అదే మారుతి స్విఫ్ట్ CNG ZXI గురించి మాట్లాడితే.. ఈ కారు ధర ఎక్స్​-షోరూమ్ వద్ద రూ.8,53,000గా ఉంది. అదే దీనిని క్యాంటీన్ స్టోర్ నుంచి రూ. 7,35,042కి కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.1,17,958 ఆదా చేసుకోవచ్చు.

Maruti Swift Features :మారుతి స్విఫ్ట్ గురించి మాట్లాడితే.. కంపెనీ LXi, ZXi, VXi, ZXi+ అనే నాలుగు వేరియంట్‌లలో కార్లను విక్రయిస్తోంది. అలాగే VXi, ZXi ట్రిమ్‌లలో CNG ఆప్షన్‌ కూడా ఉంది. ఇక దీనిలో ఫీచర్ల విషయానికొస్తే.. మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఈ కారు 90PS పవర్, 113 Nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఇక దీనిలోని ఇంజిన్ 5-స్పీడ్ ఆటోమేటిక్, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చి ఉంది. మారుతి స్విఫ్ట్ క్లెయిమ్ చేసిన మైలేజ్.. పెట్రోల్ వేరియంట్‌లో 22 kmpl, CNG వేరియంట్‌లో 30.90km/kgగా ఉంది. అదేవిధంగా ఈ కారులో 268 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

ABOUT THE AUTHOR

...view details