మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా మోడళ్ల కార్ల యజమానులకు అలర్ట్. ఆ మోడల్ కార్లలో వెనుక సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లలో లోపాలను సరిచేసేందుకు.. 11,177 కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ సోమవారం తెలిపింది. మారుతీ సుజుకీ కార్ల రీకాల్ గురించి స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. 2022 ఆగస్టు 8 నుంచి నవంబరు 15 మధ్య తయారైన ఈ మోడల్ కార్లలో.. ఈ లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. లోపాలున్న భాగాలను ఉచితంగా మార్చి ఇస్తామని తెలిపింది.
మారుతీ సుజుకీ ఓనర్లకు బిగ్ అలర్ట్.. 11 వేల కార్లు రీకాల్
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా మోడళ్ల కార్ల యజమానులకు అలర్ట్ చేసింది. ఈ మోడల్ కార్లలో వెనుక సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీని కారణంగా 11,177 కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది.
అంతకుముందు కూడా ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్‌లో లోపాలు సరిదిద్దేందుకు.. 17,362 కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు మారుతీ వెల్లడించింది. 2022 డిసెంబర్ 8 నుంచి 2023 జనవరి 12 మధ్యలో తయారైన కార్లను వెనక్కు పిలిపిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆల్టో కే10, బ్రెజా, బలీనో, ఎస్ప్రెస్సో, ఈకో, గ్రాండ్ విటారా మోడళ్ల కార్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. సమస్య తీవ్రత దృష్ట్యా.. ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్లోని లోపాన్ని సరిచేసే వరకు ఆ కార్లను డ్రైవ్ చేయొద్దని సూచించింది మారుతి సుజుకీ.