Maruti Suzuki Jimny 2023 Bookings Started :ఇప్పుడు.. మీరు కొత్తగా ఓ కారు కొనాలనుకుంటున్నరు. లేదంటే.. ఉన్నది మార్చేసి కొత్తది తీసుకుందామనుకుంటున్నరు. అయితే.. రెగ్యులర్ మోడల్ ను సెలక్ట్ చేసుకునే ఆలోచనలో ఉంటే మాత్రం ఈ స్టోరీ పెద్దగా యూజ్ కాకపోవచ్చు. కానీ.. కొందరుంటారు. "ఏదైనా చేస్తున్నామంటే.. సమ్ థింగ్ స్పెషల్ ఉండాలె" అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్లకు మస్తు యూజ్ అవుతుంది. ఎందుకంటారా..? ఇక్కడ మారుతి జిమ్నీ గురించి డిస్కస్ చేస్తున్నం మరి!
రంగం ఏదైనా.. టెక్నాలజీ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. నిత్యం ఎన్నో అప్డేట్లు, సరికొత్త మోడల్స్, వెర్షన్స్.. మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఫోర్ వీలర్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం SUVల హవా నడుస్తోంది. సఫారీ టూర్స్ వంటి వాటిల్లో వినియోగించే ఓ SUVని మన రోడ్లపై తిప్పేందుకు తీసుకొచ్చింది మారుతి సుజుకి (Maruti Suzuki). దాని పేరే జిమ్నీ. మరి, దీని ఫీచర్స్, ప్రైస్ వంటి డీటెయిల్స్ చూసేద్దామా..
సుజుకి లాస్ట్ ఇయర్.. "గ్రాండ్ విటారా కాంపాక్ట్ SUV"ని పట్టుకొచ్చింది. ఇప్పుడు తన SUV పోర్ట్‌ఫోలియోను మరింతగా ఎలాబ్రేట్ చేస్తూ.. ఆటో ఎక్స్‌పోలో.. Jimny 5- డోర్ వెర్షన్‌ను పరిచయం చేస్తోంది. మార్కెట్లో ఈ వెర్షన్ లవర్స్ భారీగానే పెరిగిపోతున్నారు. ఇప్పటి వరకూ ఈ మారుతి జిమ్నీని.. గ్లోబల్ మార్కెట్లో ఏకంగా 3.2 మిలియన్ కు పైగా యూనిట్లను విక్రయించింది.