Suzuki Grand Vitara Vs Kia Carens Prestige : "బైకు అంటే సౌకర్యం.. కారు అంటే విలాసం" అన్నట్టుగా ఉండేది గతంలో పరిస్థితి. కానీ.. కాలం మారింది. ద్విచక్రవాహనం ఏనాడో అత్యవసరంగా మారిపోగా.. కారు కూడా క్రమంగా విలాసపు మెట్టు దిగి.. సౌకర్యపు గీత దాటి.. "అవసరపు" మలుపు తీసుకుంటున్నది. చాలా మంది ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొనో.. మరో కారణం చేతనో.. కారు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని ఆటోమొబైల్ సంస్థలు.. రకరకాల ఫ్యామిలీ కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన సుజికీ(Suzuki), కియా ఇండియాలు సరికొత్త ఫీచర్లతో ఫ్యామిలీ కార్లను తీసుకొచ్చాయి. మరి, వీటి ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా..
Suzuki Grand Vitara Vs Kia Carens :ప్రస్తుతం మార్కెట్లో సుజుకి గ్రాండ్ విటారా,కియా కారెన్స్(Kia Carens) ఫ్యామిలీ కార్ల కొనుగోలుదారులలో మంచి స్కోర్‌ను కలిగి ఉన్నాయి. ఇవి రెండూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఆమోదయోగ్యమైన గ్లోబల్ NCAP రేటింగ్‌లతో బలమైన భద్రతను అందిస్తున్నాయి. ఇవి రెండూ రూ.15 లక్షలలోపు ధరను కలిగి ఉన్నాయి. వీటిలో విశాలమైన ఇంటీరియర్స్, రిక్లైనింగ్ రియర్ సీట్లు, కూలింగ్ గ్లోవ్‌బాక్స్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ సౌకర్యంగా ఉంటాయి. టచ్‌స్క్రీన్ సిస్టమ్, మల్టిపుల్ ఛార్జింగ్ పాయింట్స్, స్టీరింగ్ సర్దుబాటు సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఇంకా డీటెయిల్‌గా చూస్తే...
Upcoming Cars In India : రూ.15 లక్షల లోపు కారు కొనాలా? అప్‌కమింగ్ టాప్ 5 కార్లు ఇవే!
గ్రాండ్ విటారా జీటా CNG(Maruti Suzuki Grand Vitara Zeta CNG) :
గ్రాండ్ విటారా జీటా CNG వేరియంట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
ABS, ట్రాక్షన్ కంట్రోల్, 4-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ అందిస్తోంది.
265 లీటర్ల బూట్ స్పేస్, రిక్లైనింగ్ Rear సీట్లు కలిగి దూర ప్రయాణాలలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
వెనుక AC వెంట్‌లు, ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఉంది.
స్టీరింగ్ నియంత్రణ, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.
మార్కెట్లో 29 సెప్టెంబర్ 2023 నాటికి గ్రాండ్ విటారా జీటా CNG వేరియంట్ ధర రూ. 14,86,000గా ఉంది.
కియా కారెన్స్ ప్రెస్టీజ్ ప్లస్ iMT(Kia Carens Prestige Plus iMT) :