మారుతి సుజుకీ, హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్.. అప్పటి వరకే ఛాన్స్! - ఆగస్టులో కార్లపై బెస్ట్ డిస్కౌంట్లు
Maruti Suzuki Car Offers August 2023 : మరోసారి భారీ డిస్కౌంట్ ఆఫర్లను కస్టమర్లకు ఇస్తున్నాయి ప్రముఖ కార్ల సంస్థలు. మారుతి సుజుకీ.. కార్ల కొనుగోలుపై దాదాపు రూ.54,000 వరకు రాయితీలను అందిస్తోంది. మారుతీ సుజుకీ, హ్యూందాయ్‌కు చెందిన వివిధ కార్లపై సంస్థ ఇచ్చే డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
maruti suzuki car offers august 2023
By
Published : Aug 10, 2023, 2:41 PM IST
|
Updated : Aug 10, 2023, 2:48 PM IST
Maruti Suzuki Car Offers August 2023 : మారుతి సుజుకీ, హ్యూందాయ్ సంస్థలు.. కార్లపై సంవత్సరం పొడుగునా డిస్కౌంట్లు ప్రకటిస్తూనే ఉంటాయి. అదే తరహాలో మరోసారి భారీ ఆఫర్లతో కంపెనీ.. కస్టమర్ల ముందుకు వచ్చాయి. 2023 ఆగస్టులో కార్ల కొనుగోలుపై.. భారీగా డిస్కౌంట్లు అందిస్తున్నాయి. మారుతి సుజుకీ, హ్యూందాయ్ ఏఏ కార్లపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాయో తెలుసుకుందాం.
భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మోడళ్ల కార్లను మార్కెట్లోకి తెస్తుంది. మారుతి సుజుకీ తమ కంపెనీ అమ్మకాలను పెంచుకునేందుకు, కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆ సంస్థకు చెందిన ఆల్టో 800, ఆల్టో కే10, మారుతి సెలీరియో, మారుతి ఎస్ ప్రెస్సో, మారుతి వాగన్- ఆర్, మారుతి స్విఫ్ట్ , మారుతి డిజైర్, మారుతి బ్రెజ్జా మోడళ్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు ప్రకటించింది.
మారుతీ ఆల్టో 800.. Maruti Alto 800 Car : మారుతీ ఆల్టో 800 మోడల్‌పై డిస్కౌంట్ లేదు. కానీ బేస్ ఎస్టీడీ మోడల్ మినహా మిగతా వాటిపై రూ.15 వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది.
ఆల్టో కే-10.. Maruti Alto K10 : ఈ మోడల్ మాన్యువల్ వేరియంట్లపై రూ.35,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఆటోమెటిక్, సీఎన్జీ వెర్షన్లపై రూ.20 వేలు రాయితీని పొందొచ్చు. ఈ వెర్షన్ కార్లకు ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ బోనస్ కింద రూ.4,100 తగ్గుతుంది.
మారుతి సెలీరియో.. Maruti Celerio : మారుతి సెలీరియో మోడల్ కారుపై రూ.35,000.. సీఎన్జీ, అటోమేటిక్ వేరియంట్ మోడల్‌పై రూ.20 వేలు రాయితీ లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ బోనస్ రూ.5వేలు లభిస్తుంది.
మోడల్
డిస్కౌంట్
ఎక్స్చేంజ్ బోనస్+కార్పొరేట్ డిస్కౌంట్
Maruti Alto 800
0
రూ.15,000+0
Maruti Alto K10
రూ.35,000
రూ.15,000+రూ.4,100
Maruti Celerio
రూ.35,000
రూ.15,000+రూ.5100
Maruti S-Presso
రూ.35,000
రూ.15,000+రూ.4,100
Maruti Wagon-R
రూ.35,000
రూ.15,000+రూ.4,000
Maruti Swift
రూ. 25,000
రూ.15,000+రూ.5,000
Maruti Eeco
రూ.15,000
రూ.10,000+రూ.3,100
Maruti Dzire
0
రూ.10,000+0
Maruti Ignis, Maruti Baleno, Maruti Ciaz కార్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. Maruti Ignis మోడల్ కారుకు రూ.35 వేల డిస్కౌంట్, రూ.15 వేలు ఎక్స్చేంజ్ బోనస్, రూ.4 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. Maruti Balenoమోడల్ కారుపై రూ.20 వేల డిస్కౌంట్, రూ.10 వేల ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. అలాగే Maruti Ciaz కారుపై ఎలాంటి డిస్కౌంట్ లేదు కానీ రూ.25 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ.3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది.
హ్యూందాయ్ ఆఫర్లు..అలాగే హ్యూందాయ్ కంపెనీ కూడా వినియోగదారులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. అవేంటంటే?