తెలంగాణ

telangana

ETV Bharat / business

మారుతీ సుజుకీ కార్లపై భారీగా డిస్కౌంట్లు.. అప్పటి వరకే ఛాన్స్! - ఏప్రిల్ 2023 మారుతీ కార్లపై డిస్కౌంట్​

2023 ఏప్రిల్​లో మరోసారి భారీ ఆఫర్లను కస్టమర్​లకు ఇచ్చేందుకు సిద్ధమైంది మారుతీ సుజుకీ సంస్థ. కార్ల కొనుగోలుపై దాదాపు రూ.59,000 వరకు డిస్కౌంట్​లను అందిస్తోంది. మారుతీ సుజుకీ చెందిన వివిధ కార్లపై సంస్థ ఇచ్చే డిస్కౌంట్​లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Maruti Suzuki April 2023 Discounts
మారుతీ సుజుకీ కార్లపై డిస్కౌంట్​లు

By

Published : Apr 6, 2023, 8:13 PM IST

మారుతీ సుజుకీ సంస్థ.. కార్లపై సంవత్సరం పొడుగున డిస్కౌంట్​లు ప్రకటిస్తూనే ఉంటుంది. అదే తరహాలో మరోసారి భారీ ఆఫర్లతో కంపెనీ.. కస్టమర్​ల ముందుకు వచ్చింది. 2023 ఏప్రిల్​లో జరిగే కార్ల కొనుగోలుపై.. భారీగా డిస్కౌంట్​లు అందిస్తోంది. కంపెనీ మోడళ్లపై.. వివిధ రకాలుగా తగ్గింపులను ఇస్తోంది. కార్లపై కంపెనీ ఇచ్చే డిస్కౌంట్​ గరిష్ఠంగా రూ.59,000 వరకు ఉంది. మరి ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ ప్రకటించిందో చూద్దామా?

ఆల్టో K10..
ఈ కారుపై.. మిగతా వాటి కంటే ఎక్కువ డిస్కౌంట్​ను ఇస్తోంది మారుతీ సుజుకీ. కస్టమర్​ ఆఫర్ కింద రూ.40,000లను డిస్కౌంట్​గా అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరో రూ. 15,000ల తగ్గింపును ఇస్తోంది. రూ.4000లను కార్పొరేట్ డిస్కౌంట్​గా పొందవచ్చు. మొత్తంగా ఈ ఆఫర్లపై రూ. 59,000 పొదుపు చేసుకోవచ్చు.

ఆల్టో K10

మారుతీ ఎస్​-ప్రెస్సో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్ కార్లు..
మారుతీ ఎస్​-ప్రెస్సో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్ కార్లుపై కూడా కంపెనీ భారీగానే డిస్కౌంట్​లు ప్రకటించింది. ఈ కార్లపై రూ.30,000ల వరకు కస్టమర్​ ఆఫర్ కింద కంపెనీ డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 15,000లను ఎక్స్ఛేంజ్ బోనస్ కింద, కార్పొరేట్ డిస్కౌంట్​ కింద రూ.4000 తగ్గింపు ప్రకటించింది. మొత్తంగా ఒక్కో కారుపై రూ.49,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

మారుతి ఎస్​-ప్రెస్సో
మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్

మారుతీ సెలెరియో..
సెలెరియో కార్లపై కూడా సంస్థ డిస్కౌంట్​లను బాాగానే ఇస్తోంది. సెలెరియోపై రూ.25,000లను.. కస్టమర్​ డిస్కౌంట్​ ఆఫర్​గా పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.15,000ల తగ్గింపు ఉంటుంది. కార్పొరేట్ డిస్కౌంట్​ కింద రూ.4000​ను.. సంస్థ అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై మొత్తంగా రూ.44,000ల డిస్కౌంట్​ను కంపెనీ నుంచి పొందవచ్చు.

ఆల్టో 800..
ఈ కారుపై.. మారుతీ సంస్థ మొత్తంగా రూ.28,000 డిస్కౌంట్​గా అందిస్తోంది. అందులో రూ.10,000 కస్టమర్​ డిస్కౌంట్​ కింద, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కింద, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్​ కింద ఇస్తోంది.

మారుతి ఈకో..
ఈ కారుపై.. కంపెనీ రూ.28,000 మొత్తాన్ని డిస్కౌంట్​గా ఇస్తోంది. దాంట్లో కస్టమర్​ డిస్కౌంట్​ కింద రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్​ కింద రూ.3,000 ఉన్నాయి.

అదే విధంగా ఎర్టిగా టూర్ ఎమ్​, వ్యాగన్ ఆర్ టూర్ ఎచ్​3, డిజైర్​ టూర్​ ఎస్​, ఆల్టో టూర్​ వీ, సూపర్ క్యారీ వంటి కమర్షియల్​ కార్లపైనా కంపెనీ డిస్కౌంట్​లను అందిస్తోంది. వీటిపై ఇచ్చే డిస్కౌంట్​లు.. వాటి కార్ల వేరియంట్లు, పవర్​ట్రై​యిన్ ఎంపికపై ఆధారపడి ఉంటాయి. మారుతీ సుజుకీ బ్రెజ్జా కాకుండా మిగతా సబ్-కాంపాక్ట్ ఎస్​యూవీలపై.. ఎటువంటి డిస్కౌంట్​లు కంపెనీ ఇవ్వటం లేదు. అయితే ఈ డిస్కౌంట్​లన్నీ కారు వేరియంట్, ఇంధన రకం, ఎంచుకునే పవర్‌ట్రెయిన్​పై ఆధారపడి ఉంటాయి.

మారుతీ సుజుకీ ఎర్టిగా

ABOUT THE AUTHOR

...view details