LPG price cut news: వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నుంచి రూ.36 మేర తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా దిల్లీలో ఇప్పటివరకు రూ.2,012.50గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1,976కు చేరింది. అంతకుముందు జులై 6న గ్యాస్ సిలిండర్ ధర రూ.8.5 తగ్గింది.
గుడ్ న్యూస్.. వంట గ్యాస్ ధర తగ్గింపు.. ఎంతంటే... - గ్యాస్ ధరలు
08:00 August 01
గుడ్ న్యూస్.. వంట గ్యాస్ ధర తగ్గింపు.. ఎంతంటే...
ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి..
*కోల్‌కతా: రూ.2,132.50
*ముంబయి: రూ.1,972.50
*చెన్నై: రూ.2,177.50
గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ.1053గా ఉంది. కోల్‌కతాలో రూ.1079, ముంబయిలో రూ.1052.5, చెన్నైలో రూ.1068.5గా ఉంది. అంతకుముందు వంటగ్యాస్ ధరను జులై 6న సిలిండర్‌కు రూ.50 పెంచాయి చమురు సంస్థలు.
ఇదీ చదవండి:ముష్కరుల తూటాలకు బెదరని శునకం.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం