LPG Gas Cylinder Price Hike : ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.101.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. గత రెండు నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం ఇది రెండో సారి కావడం గమనార్హం.
Domestic Gas Cylinder Rates :వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని చమురు సంస్థలు ప్రకటించాయి. సామాన్యులకు ఇది కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు
Commercial Gas Cylinder Price : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన నేపథ్యంలో.. దిల్లీలో 19కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1731 నుంచి రూ.1833కు పెరిగింది. అలాగే కోల్కతాలో రూ.1943కు, ముంబయిలో రూ.1785.50కు, బెంగళూరులో రూ.1914.50కు, చెన్నైలో రూ.1999.50కు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది.
వంట గ్యాస్ సిలిండర్ ధరలు
Domestic Gas Cylinder Price : కోల్కతాలో 14.2 కేజీల వంట గ్యాస్ ధర రూ.929గా ఉంది. ముంబయిలో రూ.902.5, చెన్నైలో రూ.918.5లుగా ఉంది. ఇక దిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.903గా ఉన్నది.
గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించేది ఎవరు?
Who Decides LPG Prices In India :ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు.. వాణిజ్య గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి.