Lpg Gas Cylinder Price Increase :వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.21 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మార్పులకు అనుగుణంగా ఈమేరకు ధరలు సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం ప్రకటించాయి. అయితే.. గృహ అవసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి.
హోటల్స్, రెస్టారెంట్స్ సహా ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల గ్యాస్ బండ ధర ఇప్పటివరకు దిల్లీలో 1,775.50గా ఉంది. తాజా పెంపుతో అది రూ.1,796.50కు చేరింది.
తగ్గిన ఏటీఎఫ్ ధర..
ATF Fuel Price In India :మరోవైపు.. విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్-ఏటీఎఫ్ ధర 4.6శాతం మేర తగ్గినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఇప్పటివరకు దిల్లీలో కిలోలీటరుకు రూ.1,11,344.92గా ఉన్న ఏటీఎఫ్ ధర.. రూ.1,06,155.67కు తగ్గినట్లు తెలిపాయి. గత నెల రోజుల్లో ఏటీఎఫ్ ధర తగ్గడం ఇది రెండోసారి.
గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించేది ఎవరు?
Who Decides LPG Prices In India :ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. కాగా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం గత 20 నెలలుగా ఎటువంటి మార్పు లేదు.