LPG Gas Cylinder Price Decrease : నూతన సంవత్సరం వేళ 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం రూపాయిన్నర తగ్గించాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు. గృహ అవసరాల వంటగ్యాస్ ధరను మాత్రం యథాతథంగా ఉంచాయి. ప్రస్తుతం 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.903గా ఉంది.
కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను హోటల్స్, రెస్టారెంట్లు లాంటి వాటిల్లో వాడతారు. తాజా తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు సోమవారమే అమల్లోకి వచ్చాయి. దీనితో దిల్లీలో రిటైల్ 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. రూ.1757 నుంచి రూ.1,755.50కు తగ్గింది. ముంబయిలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ రూ. 1,708.50కు చేరింది.
మరోవైపు, విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్-ఏటీఎఫ్ ధర 4శాతం మేర తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు సోమవారం ప్రకటించాయి. ఇప్పటివరకు దిల్లీలో కిలోలీటరుకు రూ. రూ.1,06,155.67గా ఉన్న ఏటీఎఫ్ దర, రూ.101,993.17కు తగ్గించినట్లు తెలిపాయి.
Commercial LPG Prices Cut :గతేడాది డిసెంబరు 22వ తేదీన 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.39.50 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు.