తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇలా చేస్తే EMI భారం నుంచి సత్వర విముక్తి! - మనీ ప్లానింగ్స్​

ప్రస్తుత కాలంలో ఆట వస్తువు నుంచి ఆడి కారు వరకు ఏది కొనాలన్నా అప్పు​ దొరుకుతుంది. మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా వాయిదాల పద్దతి కూడా అందుబాటులో ఉంది. అడిగిన వెంటనే బ్యాంకులు కూడా లోన్​ను అందిస్తున్నందును.. పండగ సమయాల్లో చాలా మంది.. ఈఎంఐ పద్దతుల్లో రకరకాల వస్తువులు కొంటున్నారు. అయితే అలా తీసుకున్న లోన్​ను తొందరగా ఎలా చెల్లించి.. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలో తెలుసుకుందామా మరి..!

personal money management
అప్పుల భారాలను ఎలా వదిలించుకోవాలి

By

Published : Nov 11, 2022, 2:47 PM IST

ఒకప్పుడు అప్పు దొరకడం చాలా కష్టం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అడిగిన వెంటనే క్షణాల్లో బ్యాంకు ఖాతాలో రుణమొత్తం జమ అవుతోంది. ఏదైనా కొనాలన్నా డబ్బుతో అవసరం లేకుండా వాయిదాల్లో చెల్లించే ఏర్పాటు ఉంది. పండగల వేళ ఎంతోమంది ఈ వెసులుబాట్లనే ఉపయోగించుకున్నారు. ఇలా చేసిన అప్పులను వీలైనంత తొందరగా వదిలించుకునే ప్రయత్నం చేస్తేనే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వవు.

  • పండగల వేళ ఎంత ఖర్చు చేశారో ముందుగా లెక్క తీయండి. ఇందులో మీ పొదుపు మొత్తం ఎంత? రుణం ఎంత తీసుకున్నారో చూసుకోండి. ఏయే అప్పులకు ఎంత వ్యవధి ఉంది, వడ్డీ ఎంత చెల్లిస్తున్నారు పరిశీలించండి. ముఖ్యంగా వ్యక్తిగత, ఇప్పుడు కొనండి-తర్వాత చెల్లించండి (బీఎన్‌పీఎల్‌) రుణాలను చూసుకోండి. పాత, కొత్త రుణాలను ఒక చోట రాసి పెట్టుకోండి. అప్పుడే మీకు రుణాల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు మీ ఆదాయం, అందులో మిగిలే మొత్తంతో ఆయా అప్పులను ఎలా తీర్చాలని అనుకుంటున్నారో ప్రణాళిక వేసుకోండి.
  • ముందస్తుగా తీర్చేందుకు వీలున్న అప్పులను గుర్తించండి. అధిక వడ్డీ ఉన్న రుణాలను సాధ్యమైనంత వేగంగా వదిలించుకోవాలి. లేకుంటే మీ పొదుపు మొత్తాన్ని అధికభాగం ఇవే తినేస్తాయి. చిన్న రుణాలనూ చెల్లించేందుకు ప్రయత్నించండి. వీటివల్ల ఎక్కువ రుణాలు ఉన్నట్లు అనిపిస్తుంది. ముందస్తు చెల్లింపుల వల్ల రుసుముల భారం ఏ మేరకు ఉంటుందో చూసుకోవాలి.
  • తక్కువ రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. 8 శాతం రాబడి ఆర్జించే పథకాలో పొదుపు కొనసాగిస్తూ, 16 శాతం వడ్డీకి రుణాలను తీసుకోవడం భావ్యం కాదు. వీలైతే ఎఫ్‌డీలు, జీవిత బీమా పాలసీలపై రుణాలను తీసుకోండి. దీనివల్ల తక్కువ వడ్డీకి రుణం దొరుకుతుంది. బంగారాన్ని హామీగా ఉంచి అప్పు తీసుకున్నా తక్కువ వడ్డీ వర్తిస్తుంది.
  • ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించండి. దీనివల్ల తొందరగా రుణాలను తీర్చే మార్గం దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో ఈ విషయంపై చర్చించండి. ఆదాయ-అప్పుల నిష్పత్తి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఉన్న గృహరుణం ఈఎంఐ తగ్గించుకునే అవకాశం ఉందా అనేది బ్యాంకుతో చర్చించండి.
    పండగల వేళ ఆనందంగా కొనుగోళ్లు చేసినా, ఆ అప్పులను వీలైనంత తొందరగా తీర్చినప్పుడే అది రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని రుణాలను తీర్చే ప్రణాళికలను వెంటనే అమలు చేయండి.
  • ఇప్పటికే చేసిన అప్పులను తీర్చే వరకూ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. లేకపోతే.. ఆర్థికంగా చిక్కులు తప్పవు. అనవసర, విలాస వ్యయాలను నియంత్రించుకోవాలి. కొన్నాళ్లపాటు తక్కువ మొత్తంతోనే జీవించే అలవాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త రుణాలు, క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్ల జోలికి పోవద్దు. అవసరమైతే కొన్నాళ్లపాటు కార్డును ఫ్రీజ్‌ చేయండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details