Bank holidays in July 2023 India : బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్. బక్రీద్ పర్వదినం సందర్భంగా జూన్ 28, 29 తేదీల్లో పలు రాష్ట్రాలు, నగరాల్లోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కనుక బ్యాంకింగ్, ఏటీఎమ్ సేవలపై ప్రభావం పడనుంది. అందువల్ల బ్యాంకు పనులు ఉన్నవారు కచ్చితంగా బ్యాంకు సెలవులకు అనుగుణంగా మీ టైమ్‌ను కేటాయించుకొని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేసుకోండి.
- జూన్ 28 తేదీన : బక్రీద్ సందర్భంగా జూన్ 28 తేదీన పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అందువల్ల కేరళ, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో.. బేలాపూర్, కోచి, ముంబయి, నాగ్‌పుర్, శ్రీనగర్, తిరువనంతపురం మొదలైన నగరాల్లోని బ్యాంకులు పనిచేయవు.
- జూన్ 29 తేదీన :దిల్లీ, శ్రీనగర్, చంఢీగర్, ఇంఫాల్, జైపుర్, అహ్మదాబాద్, అగర్తలా, బెంగళూరు, ఐజ్వాల్, పనాజీ, పట్నా, చెన్నై, దెహ్రాదూన్, హైదరాబాద్, రాంచీ, జమ్ము, కోల్‌కతా, లఖ్‌నవూ, షిల్లాంగ్, శిమ్లా, భోపాల్, గువాహటి, కాన్పుర్ నగరాల్లో బక్రీద్ (ఈద్ అల్ అదా) సందర్భంగా జూన్ 29వ తేదీన బ్యాంకులకు సెలవు.
బ్యాంకు సెలవులు - కేటగిరీలు
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా.. బ్యాంకు సెలవు దినాలను 3 కేటగిరీలుగా విభజించింది.
1. హాలీడేస్ అండర్ ది నెగోసియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్
2. హాలీడేస్ అండర్ నెగోసియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలీడేస్