తెలంగాణ

telangana

ETV Bharat / business

Life Insurance Vs Term Insurance : లైఫ్ ఇన్సూరెన్స్ VS ట‌ర్మ్ ఇన్సూరెన్స్.. ఏది బెస్ట్ ఆప్షన్​?

Life Insurance Vs Term Insurance : బీమా ప‌థ‌కాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. ఇవి మ‌న కుటుంబానికి ఆరోగ్య భ‌ద్ర‌త‌ను కల్పిస్తాయి. అలాగే మన తరువాత మన కుటుంబానికి అండగా నిలుస్తాయి. మ‌న‌కు ప్ర‌ధానంగా రెండు ర‌కాల బీమా ప‌థ‌కాలున్నాయి. ఒక‌టి లైఫ్ ఇన్సూరెన్స్ కాగా, రెండోది ట‌ర్మ్ ఇన్సూరెన్స్. మ‌రి ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఛాయిస్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Life Insurance Vs Term Insurance Which Is Better Option In Telugu
Life Insurance Vs Term Insurance

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 4:34 PM IST

Life Insurance Vs Term Insurance : లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్ర‌తి ఒక్క‌రి చాలా అవసరం. ఈ కాలంలో దాదాపుగా అందరికీ ఈ రకం పాలసీలు ఉంటున్నాయి. ఇవి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న కుటుంబానికి ఆర్థిక భ‌ద్ర‌త‌ కలుగుతుంది. అనుకోని దురదృష్టకర పరిస్థితుల్లో పాలసీదారుడు మరణిస్తే.. ఈ బీమా పాలసీలు అతని కుటుంబానికి ఆస‌ర‌గా నిలుస్తాయి. అయిన‌ప్ప‌టికీ చాలా మంది వీటిని తీసుకోవ‌డానికి వెనుకంజ వేస్తారు. కొంత కాలం పాటు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం భారంగా భావించ‌డ‌మే ఇందుకు ప్రధాన కార‌ణం.

ప్రస్తుతం మార్కెట్​లో ర‌క‌ర‌కాల ప్రయోజనాల కోసం వివిధ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైనవి లైఫ్ ఇన్సూరెన్స్​, టర్మ్ ఇన్సూరెన్స్. అయితే ఈ రెండింటి ( Term Insurance Vs Life Insurance )లో ఏది బెస్ట్ ఛాయిస్​ అనే దానిపై ఓ క్లారిటీ రావాలంటే గనుక ఈ కింది విషయాలను తెలుసుకోండి.

లైఫ్ ఇన్సూరెన్స్..!
Life Insurance Policy : అత్యవసర పరిస్థితి లేదా ఆకస్మిక మరణం సంభవించినప్పుడు మీ కుటుంబానికి లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా కష్టసమయంలో మ‌న కుటుంబానికి ఆర్థిక భద్ర‌త‌ను క‌ల్పిస్తుంది. జీవిత బీమా పాలసీ తీసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా పాలసీదారులు తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు వైద్య ఖ‌ర్చులు అందిస్తాయి. పాలసీదారునికి శాశ్వత అంగవైకల్యం కలిగినప్పుడు కూడా మెచ్యూరిటీ మొత్తం అందిస్తాయి. ఒక వేళ పాలసీదారుడు దురదష్టవశాత్తు అకాల మరణం పొందితే అంత్యక్రియల ఖర్చులతో పాటు.. పాలసీదారుని కుటుంబానికి ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందిస్తాయి. ఫలితంగా ఆ కుటుంబం ఆర్థిక కష్టాల్లోకి జారుకోకుండా సురక్షితంగా ఉంటుంది.

ట‌ర్మ్ ఇన్సూరెన్స్​..!
Term Insurance Plan :ఒక నిర్దిష్ట కాలానికి, నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించ‌డం ద్వారా టర్మ్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో పాలసీదారు గడువు ముగిసేవరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ టర్మ్ పాలసీ కొనసాగుతున్న సమయంలోనే, పాలసీదారుడు మరణిస్తే.. బీమా కంపెనీ నామినీకి డెత్ బెనిఫిట్ మొత్తాన్ని చెల్లిస్తుంది. అదే పాల‌సీదారుడు జీవించి ఉంటే గనుక టర్మ్ సమయంలో ఎలాంటి మెచ్యూరిటీ అందించ‌రు.

రెండింటికీ తేడా ఏంటి?
LIC Vs Term Plan : జీవిత బీమా అనేది మీరు కొనుగోలు చేసే ఒక క‌చ్చితమైన కవరేజీ. జీవిత బీమా చెల్లింపును నిలిపివేస్తే, మీరు ప్రీమియంగా డిపాజిట్ చేసిన మొత్తాన్ని మాత్రమే అందుకుంటారు. అదే ట‌ర్మ్ పాల‌సీ అలా కాదు. లైఫ్ ఇన్సూరెన్స్​తో పోలిస్తే.. టర్మ్ ఇన్సూరెన్స్ చాలా​ త‌క్కువ‌ ప్రీమియానికే లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో క‌నీస మొత్తంతో కూడిన హామీ లభిస్తుంది. ఈ పాలసీలో మీకు తక్కువ ప్రీమియంతో.. ఎక్కువ రాబడి వ‌స్తుంది. ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్​​ పాల‌సీ ప్రీమియంను మధ్యలో చెల్లించడం మానేస్తే.. వెంటనే ఆ పాలసీని నిలిపివేయడం జరుగుతుంది.

మరి ఏది బెస్ట్​ ఆప్షన్​?
Which Is Best LIC Term Plan : ఈ రెండు పాల‌సీల్లో ఏది తీసుకోవాల‌నే విష‌యం పూర్తిగా మీ ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది. మీరు స్వల్పకాలిక ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది కనుక.. మీకు డబ్బు బాగా ఆదా అవుతుంది. ఒక వేళ మీరు దీర్ఘకాలిక, జీవితకాల కవరేజ్ కోసం చూస్తున్నట్లయితే, జీవిత బీమా తీసుకోవడం మంచి ఎంపిక అవుతుంది. ఏదైనా పాల‌సీని ఎంచుకునే ముందు బాగా ప‌రిశోధించి, సంబంధిత నిపుణుల సూచ‌న‌లు తీసుకోవడం ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details