LIC Q2 Profits: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.15,952 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.1434 కోట్లు మాత్రమే కాగా ఈ ఏడాది మాత్రం ఊహించని స్థాయిలో లాభాన్ని ఆర్జించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాభం రూ.682.9 కోట్లుగా నమోదైంది.
క్యూ2లో దుమ్మురేపిన LIC.. రూ.680 కోట్లు లాభం - ఎల్‌ఐసీ నికర లాభాం
LIC Q2 Profits: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2లో రూ.15,952 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
త్రైమాసిక ఫలితాల్లో దుమ్మురేపిన ఎల్‌ఐసీ
సమీక్షా త్రైమాసికంలో మొత్తం ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం రూ.1.04 లక్షల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు పెరిగింది. గతేడాది పోలిస్తే 26.6 శాతం వృద్ధి నమోదైంది. ఇక తొలి ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం రూ.8198.30 కోట్ల నుంచి రూ.9124.7 కోట్లకు పెరిగింది. రెన్యువల్ ప్రీమియం సైతం 2 శాతం వృద్ధితో రూ.56,156 కోట్లకు పెరిగింది.