తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎల్​ఐసీ ఐపీఓకు అంతా రెడీ! మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే.. - ఎల్​ఐసీ న్యూస్​

LIC IPO Listing: మదుపరులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఎల్​ఐసీ ఐపీఓ చివరి అంకానికి చేరుకుంది. పబ్లిక్​ ఇష్యూకు సంబంధించిన తుది పత్రాలను సెబీకి సమర్పించింది ఆ సంస్థ. త్వరలోనే ప్రారంభం కానున్న ఎల్​ఐసీ ఐపీఓ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఓసారి చూద్దాం

lic ipo news
lic ipo news

By

Published : Apr 27, 2022, 2:37 PM IST

LIC IPO Listing: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ మే 4న పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం షేర్ ధరను నిర్ణయించింది సంస్థ. ఎల్​ఐసీని లిస్టింగ్​ చేయడం దీర్ఘకాలిక వ్యూహాత్మక దృక్పథంలో భాగమన్నారు దీపం(పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ విభాగం) కార్యదర్శి తుహిన్​కాంత పాండే. మరోవైపు.. పబ్లిక్​ ఇష్యూకు సంబంధించిన తుది పత్రాలను సెబీకి సమర్పించింది ఎల్​ఐసీ.

  • భారత జీవిత బీమా సంస్థ పబ్లిక్​ ఇష్యూలో ఒక్కో షేర్​ ధరను రూ.902-949 మధ్య ఉండనుందని ప్రకటించింది.
  • ఎల్​ఐసీ పబ్లిక్​ ఇష్యూ మే 4న ప్రారంభమై మే 9న ముగియనుంది.
  • యాంకర్​ ఇన్వెస్టర్లకు ముందుగా మే 2న విక్రయించనున్నారు.
  • రిటైల్​, సంస్థాగత కొనుగోలుదారులకు కూడా మే 4 నుంచే విక్రయించనున్నారు.
  • బిడ్డర్ల డీమ్యాట్​ ఖాతాకు మే 16 న షేర్లను కేటాయించనున్నారు.
  • ఎల్​ఐసీ ఈ ఐపీఓ ద్వారా 22,13,74,920 షేర్లను అమ్మకానికి పెట్టింది.
  • ఉద్యోగుల కోసం 15,81,249 షేర్లను రిజర్వ్​ చేసింది.
  • పాలసీదారుల కోసం 2,21,37,492 షేర్లను అట్టిపెట్టింది.
  • అర్హత గల సంస్థల కొనుగోలుదారుల(క్వాలిఫైడ్ ఇన్​స్టిట్యూషనల్​ బయ్యర్స్​) కోసం 9.88 కోట్ల షేర్లను రిజర్వ్​ చేసింది.
  • అర్హత లేని సంస్థల కొనుగోలుదారుల కోసం 2.96 కోట్ల షేర్లను కేటాయించింది.
  • ఎల్​ఐసీ ఉద్యోగులకు ఈక్విటీ షేర్​పై రూ.45 తగ్గింపు ఇవ్వనున్నారు.
  • ఎల్​ఐసీ పాలసీదారులు షేర్​పై రూ.60 తగ్గింపు పొందుతారు.

సంస్థలో 3.5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌ఐసీ విలువ(ఎంబెడెడ్‌ వాల్యూ - భవిష్యత్తు లాభాల ప్రస్తుత విలువ, సర్దుబాటు చేసిన నికర ఆస్తి విలువ కలిసి)ను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. గత ఫిబ్రవరిలో వేసిన ప్రణాళిక మేరకు ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓలో విక్రయించాల్సి ఉంది. అయితే, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంగా కారణంగా మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకులకు లోనైన నేపథ్యంలో ఐపీఓను ఇప్పటివరకు వాయిదా వేసుకుంటూ వచ్చారు.

ఇదీ చదవండి:ఎల్ఐసీ షేరు ధరల శ్రేణి ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details