తెలంగాణ

telangana

ETV Bharat / business

LIC Policy Revival Process : మీ ఎల్​ఐసీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా?.. సింపుల్​గా రివైవ్ చేసుకోండిలా! - రద్దు అయిన ఎల్​ఐసీ పాలసీని పునరుద్ధరించడం ఎలా

LIC Policy Revival Process In Telugu : మీ ఎల్​ఐసీ పాలసీ రద్దు అయ్యిందా? దానిని పునరుద్ధరించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (LIC) ఇప్పుడు రద్దు అయిన బీమా పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తోంది. మరి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

How to revive lapsed Life Insurance policy
LIC Policy Revival Process

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 12:15 PM IST

LIC Policy Revival Process : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (ఎల్​ఐసీ).. జీవిత బీమా, ఆరోగ్య బీమా సహా అనేక రకాల బీమా సౌకర్యాలను కల్పిస్తోంది. ఇవి కష్టసమయంలో పాలసీదార్లకు అండగా నిలుస్తాయి. ముఖ్యంగా పాలసీదారులకు దురదృష్టవశాత్తు ఏదైనా తీవ్రమైన ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైనా, లేదా మరణించినా.. అతని కుటుంబానికి ఎల్​ఐసీ పాలసీ ఆర్థికంగా భరోసాను కల్పిస్తుంది. అందుకే నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య, జీవిత బీమాలు ఉండడం తప్పనిసరి.

ప్రీమియం సకాలంలో చెల్లించాలి!
చాలా మంది ఎల్​ఐసీ పాలసీలు తీసుకొని, కొంత కాలం తరువాత ప్రీమియం చెల్లించడం మరిచిపోవడం లేదా పూర్తిగా మానేయడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. బీమా పాలసీలు తీసుకున్న తరువాత సకాలంలో అందుకుతగ్గ ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే పాలసీ అనేది యాక్టివ్​గా ఉంటుంది. అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తుంది. లేదంటే, పాలసీ కవరేజ్​ను కోల్పోవాల్సి వస్తుంది.

ఎల్​ఐసీ పాలసీ ఎప్పుడు రద్దు అవుతుంది?
పాలసీదారులు వరుసగా 3 దఫాలు ప్రీమియం చెల్లించకుండా ఉంటే ఎల్​ఐసీ పాలసీ రద్దు అవుతుంది. అయితే పాలసీదార్లకు అప్పటికి కూడా 15 నుంచి 30 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మరలా ప్రీమియం మొత్తం చెల్లించి, పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గ్రేస్ పీరియడ్​ ముగిసే వరకు కూడా పాలసీదారులకు బీమా కవరేజ్​ ఉంటుంది. ఒక వేళ ఈ గ్రేస్ పీరియడ్​లోపు పాలసీని పునరుద్ధరించుకోకపోతే.. అప్పుడు సదరు పాలసీ పూర్తిగా రద్దు అవుతుంది. అందుకే ఇలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే.. పాలసీ హోల్డర్లు సకాలంలో ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తూ ఉండాలి.

రద్దు అయిన ఎల్​ఐసీ పాలసీని పునరుద్ధరించవచ్చా?
LIC Policy Revival Period : ఎల్​ఐసీ పాలసీ రద్దు అయిన తరువాత పాలసీ హోల్డర్లకు ఎలాంటి బీమా ప్రయోజనాలు లభించవు. అందుకే ఎల్​ఐసీ.. తమ కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించింది. ఎల్​ఐసీ పాలసీ రద్దు అయిన 2 ఏళ్లలోపు మళ్లీ దాన్ని పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

రద్దు అయిన ఎల్​ఐసీ పాలసీని పునరుద్ధరించడం ఎలా?
How To Revive Lapsed Life Insurance Policy : ఎల్ఐసీ ప్లాన్​ నిబంధనలకు అనుగుణంగా పునరుద్ధరణ ఛార్జీలు, ఆలస్య రుసుము, అదనపు వడ్డీ లేదా పెనాల్టీ చెల్లించి.. ల్యాప్స్​ అయిన ఇన్సూరెన్స్ పాలసీలను పునరుద్ధరించుకోవచ్చు. వాస్తవానికి, రద్దు అయిన ఎల్​ఐసీ పాలసీని పునరుద్ధరించుకోవాలని అనుకునేవాళ్లు.. ముందుగా ఎల్​ఐసీ ఏజెంట్లను కలవడం ఉత్తమం. ఎందుకంటే.. ఈ ఏజెంట్ల సాయంతో ఎల్​ఐసీ బీమా పాలసీలను పునరుద్ధరించుకోవడం సులభం.

ఎల్​ఐసీ స్పెషల్​ రివైవల్​ స్కీమ్​
LIC Policy Revival Scheme 2023 :
ఎల్​ఐసీ పాలసీదార్ల కోసం.. స్పెషల్​ రివైవల్​ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా మీ ఎల్​ఐసీ పాలసీని పునరుద్ధరించమని ఒక దరఖాస్తును సమర్పించాలి.
  • దరఖాస్తుతో పాటు పాలసీ డాక్యుమెంట్స్​, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్​ ఇవ్వాలి.
  • అవసరమైతే మెడికల్ రిపోర్ట్/ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఎల్​ఐసీ సంస్థ.. మీ పాలసీ రివైవల్ అమౌంట్​ను లెక్కించి చెబుతుంది. అందుకు అనుగుణంగా..
  • ఎల్​ఐసీ రెన్యూవల్ ఛార్జీలు, ఆలస్య రుసుము, అదనపు వడ్డీ లేదా పెనాల్టీ చెల్లించాలి.
  • ఎల్​ఐసీ మీ దరఖాస్తును పరిశీలించి, మీ బీమా పాలసీని పునరుద్ధరిస్తుంది. అంతే కాదు సరికొత్త పాలసీ డాక్యుమెంట్​ను కూడా మీకు అందిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details