LIC Kanyadan Policy: ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లిచేయడం అనేదాన్ని భారంగా భావిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. అలాంటి వారికోసమే అధ్బుతమైన పాలసీని తీసుకొచ్చింది ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ). అదే 'ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ'. ఇది కేవలం ఆడపిల్లల పెళ్లికి మాత్రమే కాకుండా వారి బంగారు భవిష్యత్తు కోసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం కుమార్తె వివాహంతో పాటు ఆమె పైచదువుల ఆర్థిక అవసరాలను కూడా తీర్చడం. ముఖ్యంగా ఈ పాలసీలో ఇద్దరే భాగస్వామ్యులుగా ఉంటారు. ఒకరు కుమార్తె, మరొకరు తండ్రి.
తండ్రి మరణిస్తే..?
LIC Policy For Girl Child : ఈ పాలసీ ప్లాన్ పూర్తిగా కూతురి పేరు మీదే ఉన్నప్పటికీ పూర్తి అధికారాలు మాత్రం తండ్రికే ఉంటాయి. అయితే పాలసీ మెచ్యురిటీ కాకముందే, తండ్రి మరణిస్తే.. అతడి కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. అదెలాగంటే.. ఈ పాలసీ తీసుకున్న కొంత కాలానికే తండ్రి చనిపోతే అతడి కుటుంబం మిగతా కాలానికి పాలసీ ప్రీమియాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే ప్రీమియం మొత్తం మాఫీ అవ్వడమే కాకుండా పాలసీ ఉచితంగా అమలు అవుతుంది. అలాగే పాలసీ మిగిలిన సంవత్సరాలలో ప్రతి సంవత్సరం సమ్ అష్యూర్డ్‌లో నుంచి 10% డబ్బును కుమార్తె పొందవచ్చు. కాగా, పాలసీ వ్యవధి (మెచ్యురిటీ) ముగిశాక పాలసీ మొత్తం అమౌంట్‌ను నామినీకి అంటే కుమార్తెకు అందజేస్తారు. అయితే లబ్ధిదారుడు(తండ్రి) ప్రమాదవశాత్తు మరణిస్తే గనుక రూ.10 లక్షలు, అదే సహజ మరణమైతే రూ.5 లక్షలు కుటుంబానికి చెల్లిస్తారు.
పాలసీ వ్యవధి..
LIC Kanyadan Policy Age Limit : ఈ పాలసీ వ్యవధి 13 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే తన కుమార్తె కోసం తండ్రి ఈ పాలసీను తీసుకోవాలంటే, తండ్రి వయసు 18 నుంచి 50 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ఠ మెచ్యురిటీ వయసును 65 సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు. ఇక ఈ పాలసీని కుమార్తె పేరు మీద తీసుకోవడానికి ఆమె వయసు 1-10 సంవత్సరాల మధ్య ఉండాలి. కుమార్తె భవిష్యత్ గురించి ఆలోచించే ప్రతి తల్లిదండ్రులకు ఈ పాలసీ ఎంతగానో దోహదపడుతుంది.