LIC Jeevan Tarun Policy :ప్రస్తుతం ఎక్కడ చూసినా అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. అలాగే పిల్లల బడి, కాలేజీ ఫీజులు కూడా ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి ఉన్నత చదువులు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొనే ప్రముఖ బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మీ పిల్లల కోసం ఓ అదిరిపోయే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదే ఎల్ఐసీ 'జీవన్ తరుణ్ పాలసీ'. ఈ స్కీమ్ కింద రోజుకు రూ.171లు కడితే చాలు, మీ పిల్లలకు 25 ఏళ్లు వచ్చే సరికి చాలా పెద్ద మొత్తంలో డబ్బును అందుకుంటారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవన్ తరుణ్ పాలసీ!
LIC Jeevan Tarun Plan :జీవన్ తరుణ్ పాలసీ అనేదీ ఓ నాన్-లింక్డ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ప్లాన్. ఈ పాలసీలో మీరు కట్టే అమౌంట్‌పై ఎలాంటి మార్కెట్ ప్రభావం ఉండదు. కనుక దీన్ని సమ్-అష్యూర్డ్ ప్లాన్‌గా కూడా పరిగణించవచ్చు. అంటే మీరు మదుపు చేసిన డబ్బులు మళ్లీ మీ చేతికి తిరిగి వచ్చేస్తాయి. అంతేగాక ఎల్ఐసీకి వచ్చే లాభాల్లో నుంచి బోనస్‌ను కూడా పాలసీదారులకు అందుతుంది.
మీ వెసులుబాటు ఆధారంగా కట్టుకోవచ్చు!
Jeevan Tarun Benefits : ఈ ఎల్ఐసీ ప్లాన్‌ను తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లపై తీసుకోవచ్చు. ఇందులో మదుపు చేయడం ద్వారా ఇన్సూరెన్స్ కవరేజీతో పాటు మనీ బ్యాక్ కూడా లభిస్తుంది. ఇది మీ పిల్లల చదువులకు సంబంధించిన అవసరాలతో పాటు, ఆడపిల్లల పెళ్లి ఖర్చులను కూడా తీర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ప్రీమియంను మన వెసులుబాటుకు అనుగుణంగా కట్టుకోవచ్చు. అంటే నెల, మూడు, ఆరు నెలలకు లేదా ఏడాదికోసారి చెల్లించవచ్చు. ( Best LIC Policy For Children )
ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ తీసుకోవాలంటే మీ పాప లేదా బాబు వయసు కనీసం మూడు నెలలు లేదా 90 రోజులు ఉండాలి. గరిష్ఠంగా 12 ఏళ్ల వరకు వారి పేరుపై ఈ పాలసీని తీసుకోవచ్చు. కాగా, ఈ పాలసీని కనిష్ఠంగా రూ.75 వేల మొత్తానికి తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి గరిష్ఠ పరిమితులు లేవు. అంటే మీ స్తోమత ఆధారంగా ప్లాన్ విలువను పెంచుకోవచ్చు.