తెలంగాణ

telangana

ETV Bharat / business

LIC జీవన్ లాభ్ పాలసీ.. నెలకు రూ.7వేలు చెల్లిస్తే.. రూ.54 లక్షలు మీ సొంతం! - ఎల్ఐసి జీవన్ లాభ్ పాలసీ మెచ్యూరిటీ కాలిక్యులేటర్

Lic Policy Jeevan Labh : భారతదేశంలో ఎక్కువ మంది నమ్మే ఎల్ఐసీ నుంచి వచ్చిన పాపులర్ పాలసీ ఎల్ఐసీ జీవన్ లాభ్. మరి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు, బెనిఫిట్స్​ తెలుసుకుందాం.

lic-jeevan-labh-policy-benefits-and-benefits
ఎల్ఐసి జీవన్ లాభ్ పాలసీ

By

Published : Jul 22, 2023, 8:00 AM IST

Updated : Jul 22, 2023, 8:44 AM IST

Lic Jeevan Labh Policy : భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ మీద ప్రజలకు ఎంతో నమ్మకం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు చిన్న మొత్తంలో ఎల్ఐసీలో జమ చేస్తూ ఉంటారు. ఎల్ఐసీ కూడా ఎన్నో విస్తృత బీమా ఉత్పత్తులను అందిస్తుంది. మరీ ముఖ్యంగా ఎల్ఐసీ అందించే జీవిత బీమా లాంటి పథకాలకు చాలా మంది ముగ్దులవుతారు. ఈ పథకాలు అందించే విస్తృత లక్షణాలు,ప్రయోజనాలు దీనికి కారణం.

LIC జీవన్ లాభ్ పాలసీదారులకు బీమా, పొదుపు లాంటి రెండు ప్రధాన ప్రయోజనాలను అందిస్తుంది. దీనికి తోడు, ఈ సేవింగ్స్ ప్రోగ్రామ్ క్లయింట్‌కు బోనస్‌లను అందిస్తుంది. ఇది క్లయింట్‌కు వచ్చే తుది రాబడిని పెంచుతుంది.ఈ ఎల్ఐసీ పాలసీ మీరు దూరంగా ఉన్నప్పుడు మీ కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుతూ.. మీ డబ్బుకు మంచి భవిష్యత్తు భద్రతా వలయాన్ని అందిస్తుంది.

ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ 936 (ఇంతకు ముందు ఎల్ఐసీ జీవన్ లాభ్ 836గా పిలిచేవారు) సేవింగ్స్ ప్రయోజనాలను, జీవిత భీమాతో కలిపే ఒక ఎండోమెంట్ ప్లాన్. ఒకవేళ పాలసీ వ్యవధి పూర్తిచేసినట్టైతే, ప్లాన్ ద్వారా వచ్చే మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందుతారు. రాబడిని పెంచుకోవడం, ఖర్చులను తగ్గించుకోవడం, బీమా రక్షణను పొందటం లాంటివన్నీ ఒకే పాలసీలో పొందాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక.

Lic Jeevan Labh Policy Benefits : ఎల్ఐసీ జీవన్ లాభ్ లాభాలు:

  • డెత్ బెనిఫిట్
  • మెచ్యూరిటీ బెనిఫిట్
  • టాక్స్ బెనిఫిట్
  • పాలసీదారులు ఈ ప్లాన్ లోన్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు
  • బీమా విలువ రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే, ప్రీమియం తగ్గింపు కూడా వర్తిస్తుంది.

ఎల్ఐసీ జీవన్ లాభ్ ఎలా లెక్కిస్తారు?
Lic Policy Jeevan Labh Maturity Calculator : ఉదాహరణకు 25 సంవత్సరాల పాలసీలో నమోదు చేసుకున్న ఒక వినియోగదారుడు రూ. 54 లక్షల కోసం రూ.20 లక్షల మొత్తాన్ని ఎంచుకుంటారు. దీంతో అతడు/ఆమె పాలసీ మెచ్యూర్ అయ్యేంత వరకూ నెలకు రూ.7,572 కట్టాల్సి వస్తుంది. పాలసీ మెచ్యూర్ అయ్యాక రూ.54 లక్షలు పొందుతారు. ఈ లెక్కన వినియ్యోగదారులు సంవత్సరానికి రూ. 90,867 కట్టాల్సి వస్తుంది.

Last Updated : Jul 22, 2023, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details