LIC IPO: భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఐపీఓ బుధవారం ప్రారంభమవగా.. మూడో రోజు తొలి గంట ముగిసే సరికి రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లలో 100 శాతం సబ్స్క్రైబ్లను సాధించింది. వ్యక్తిగత రిటైల్ ఇన్వెస్టర్లకు మొత్తం 6.9 కోట్ల షేర్లు రిజర్వ్ చేయగా.. 7.2 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఉదయం 11.36 గంటల నాటికి ఈ మేరకు బిడ్లు దాఖలైనట్లు స్టాక్ ఎక్స్చేంజీల వద్ద ఉన్న గణాంకాలు చెబుతున్నాయి.
పాలసీదారుల్లో మూడు రెట్లు:సంస్థ పాలసీదారులకు కేటాయించిన షేర్లకు విశేష స్పందన లభించింది. ఇప్పటికే మూడు రెట్ల బిడ్లు దాఖలైనట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఉద్యోగుల విభాగంలో 2.5 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్యూఐబీ), నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(ఎన్ఐఐ) నుంచి పెద్దగా స్పందన లేదు. ఎన్ఐఐకి కేటాయించిన షేర్లలో 50శాతం, క్యూఐబీ విభాగంలో 40 శాతం మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా చూస్తే.. ఎల్ఐసీ ఐపీఓ పూర్తిస్థాయిలో సబ్స్క్రిప్షన్స్ సాధించింది. 16,20,78,067 షేర్లకు గాను ఇప్పటి వరకు 17,98,42,980 బిడ్లు దాఖలయ్యాయి.