తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎల్‌ఐసీ ఐపీఓకు 1.79 రెట్ల స్పందన.. దరఖాస్తుకు చివరి రోజు నేడే - ఎల్​ఐసీ ఐపీఓ

LIC IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీఓ ఎల్​ఐసీకి విశేష స్పందన కనిపిస్తోంది. షేర్ల కొనుగోలు కోసం మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. అయిదో రోజు ముగిసేసరికి 1.79 రెట్ల స్పందన లభించింది. నేటితో ఈ ఐపీఓ దరఖాస్తుకు గడువు ముగియనుంది.

lic ipo
lic ipo

By

Published : May 9, 2022, 4:26 AM IST

LIC IPO: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) అయిదో రోజు ముగిసేసరికి 1.79 రెట్ల స్పందన లభించింది. నేటితో ఈ ఐపీఓ దరఖాస్తుకు గడువు ముగియనుంది. ఎల్‌ఐసీ 16,20,78,067 షేర్లను పబ్లిక్‌ ఇష్యూకు కేటాయించగా.. 29,08,27,860 షేర్లకు బిడ్లు దాఖలైనట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల వద్ద సమాచారం లభ్యమవుతోంది.

అర్హులైన సంస్థాగత మదుపర్ల (క్యూఐబీ) విభాగం నుంచి స్పందన పూర్తిగా రాలేదు. ఈ విభాగంలో 67 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్ల (ఎన్‌ఐఐ) విభాగంలో 2,96,48,427 షేర్లకు గాను 3,67,73,040 షేర్లకు బిడ్లు (1.24 రెట్లు) వచ్చాయి. రిటైల్‌ వ్యక్తిగత మదుపర్ల విభాగంలో 6.9 కోట్ల షేర్లకు గాను 10.99 కోట్ల షేర్లకు బిడ్లు (1.59 రెట్లు) దాఖలయ్యాయి. పాలసీదార్ల విభాగంలో 5.04 రెట్లు, ఉద్యోగుల విభాగంలో 3.79 రెట్ల స్పందన లభించింది.

ఇదీ చదవండి:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. సింపుల్ విద్యార్హత... రూ.98వేల జీతం!

ABOUT THE AUTHOR

...view details