LIC IPO date: స్టాక్ మార్కెట్ వర్గాలు, రిటైల్ మదుపరులు, ట్రేడర్లు.. ఎంతగానో ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ ఐపీఓ మే 4న ఓపెన్ కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బిడ్లు దాఖలు చేసేందుకు మే 4 నుంచి మే 9 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. మే 2న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ ఓపెన్ అవుతుందని వెల్లడించాయి. అయితే, పబ్లిక్ ఇష్యూపై సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ తేదీ ఖరారు.. ఎప్పుడంటే? - ఎల్‌ఐసీ
LIC IPO date: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఐపీఓ తేదీలు ఖరారైనట్లు తెలుస్తోంది. మే 4న పబ్లిష్ ఇష్యూ ప్రారంభం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరు రోజుల పాటు బిడ్ల దాఖలుకు అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి.
రూ. 21వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా ఎల్ఐసీలోని 3.5శాతం వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 22కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. ఎల్ఐసీలో కేంద్రానికి 100శాతం వాటా ఉంది. తొలుత 5శాతం వాటా విక్రయించేందుకు సిద్దపడింది. కానీ దానిని 3.5శాతానికి కుదించింది. అయినప్పటికీ.. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది చరిత్రలో నిలవనుంది. ఎల్‌ఐసీ విలువ రూ.6 లక్షల కోట్లుగా ఉంది.
ఇదీ చూడండి:LIC IPO: 3.5 శాతానికి తగ్గిన ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ పరిమాణం