LIC Housing Finance Home Loan:ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు మాదిరిగానే ప్రముఖ గృహ రుణ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సైతం వడ్డీ రేటును సవరించింది. ప్రైమ్ లెండింగ్ రేటును 60 బేసిస్ పాయింట్లు పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు సోమవారం (జూన్ 20) నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇకపై గృహ రుణాలు 7.50 శాతం నుంచి లభ్యమవుతాయని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
LIC Home Loan interest rate:మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే వడ్డీ రేట్లు పెంచామని ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వై. విశ్వనాథ్ గౌడ్ తెలిపారు. అయినా, ఇప్పటికీ తమ సంస్థ గృహ రుణాలు పోటీనిచ్చే స్థాయిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. గృహ రుణాలకు సంబంధించి ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రైమ్ లెండింగ్ రేటును ప్రామాణికంగా తీసుకుంటుంది.