Rakesh Jhunjhunwala News: దిగ్గజ వ్యాపారవేత్త, పెట్టుబడిదారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(62) అంత్యక్రియలను ముంబయి బాణ్గంగా శ్మశానవాటికలో నిర్వహించారు ఆయన కుటుంబసభ్యులు. బిగ్ బిల్ అంతిమయాత్రకు జనం భారీగా తరలివచ్చారు.
ఆకాశా ఎయిర్ విమానయాన సంస్థకు యజమాని అయిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన ఆయన్ను ఉదయం 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు.. ముంబయిలోని బీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఫోర్బ్స్ 2021 ప్రకారం.. ఝున్‌ఝున్‌వాలా భారత్‌లో అత్యంత ధనవంతుల జాబితాలో 36వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ దాదాపు రూ. 46 వేల కోట్లు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.