తెలంగాణ

telangana

ETV Bharat / business

లక్ష రూపాయల ల్యాప్‌టాప్‌.. రూ.40వేలకే.. ఎలాగో తెలుసా? - వేదాంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇంట్రర్వ్యూ

దేశీయంగా సెమీ కండక్టర్ చిప్​సెట్లు, డిస్​ప్లే తయారీ ప్రారంభమైతే ల్యాప్​టాప్​ ధరలు తగ్గే అవకాశం ఉందని వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. ప్రస్తుతం ల్యాప్​టాప్ ధర రూ.లక్ష ఉంటే.. డిస్​ప్లే, చిప్​సెట్ల దేశీయంగా తయారీ ప్రారంభమయ్యాక రూ.40 వేలు కంటే తక్కువే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

laptop
ల్యాప్​టాప్

By

Published : Sep 15, 2022, 12:23 PM IST

Updated : Sep 15, 2022, 2:49 PM IST

దేశీయంగా సెమీ కండక్టర్‌ చిప్‌సెట్లు, డిస్‌ప్లే తయారీ ప్రారంభమైతే, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గే వీలుందని వేదాంతా గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. వేదాంతా, తైవాన్‌ సంస్థ ఫాక్స్‌కాన్‌ సంయుక్తంగా రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్‌ ప్లాంట్లను గుజరాత్‌లో నెలకొల్పేందుకు, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అనిల్‌ అగర్వాల్‌ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

'ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ ధర రూ.లక్ష అనుకుంటే.. డిస్‌ప్లే, చిప్‌సెట్ల తయారీ దేశీయంగా ప్రారంభమయ్యాక, వాటితో రూపొందిస్తే ఆ ల్యాప్‌టాప్‌ ధర రూ.40,000.. అంతకన్నా తక్కువే ఉండొచ్చు' అని అగర్వాల్‌ పేర్కొన్నారు. డిస్‌ప్లేను తైవాన్‌, కొరియా నుంచి; చిప్‌సెట్లను హాంకాంగ్‌, వియత్నాం, సింగపూర్‌, కొరియాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేశారు. మహారాష్ట్రను మొబైల్‌ఫోన్లు ముఖ్యంగా ఐఫోన్‌, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్తు వాహనాల తయారీకి కేంద్రంగా మార్చేందుకు సహకరిస్తామని తెలిపారు.

ఫాక్స్‌కాన్‌కు 38% వాటా:సెమీకండక్టర్‌ ప్లాంటును నెలకొల్పే సంయుక్త సంస్థలో తమ భాగస్వామి ఫాక్స్‌కాన్‌కు 38% వాటా ఉంటుందని, నిధులను ఆ సంస్థే తెస్తుందని అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. గుజరాత్‌ ప్లాంటు వల్ల లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

ఇవీ చదవండి:ఎస్‌బీఐ @ రూ.5 లక్షల కోట్లు.. టాప్ 10లో ఏడో స్థానానికి..

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పండగ సేల్స్.. ఆ కార్డులపై భారీగా రాయితీ

Last Updated : Sep 15, 2022, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details